వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిర్‌సెల్ మాక్సెస్ కేసు: అరెస్ట్‌పై చిదంబరం, కార్తిలకు మరింత ఊరట

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, ఆయన తనయుడు కార్తి చిదంబరంలను నవంబర్ 1వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని ఢిల్లీ హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. గతంలోను వారిని అరెస్ట్ చేయవద్దని కోర్టు చెప్పింది. ఇప్పుడు దానిని పొడిగించింది.

ఎయిర్ సెల్ మాక్సిస్ కేసులో వీరిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లు కేసులు నమోదు చేశాయి. ఈ కేసు నుంచి వారికి హైకోర్టులో ఊరట లభించింది.

Chidambaram, Sons Interim Arrest Protection Extended by Delhi Court

ఈ కేసులో సీబీఐ, ఈడీ లాయర్లు, అడిషనల్ సొలిసిటర్స్ జనరల్ తుషార్ మెహతా, నితేష్ రాణాలు కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసు గురించి పూర్తి వివరాలతో ఫైల్ చేసేందుకు సమయం కావాలని కోరారు. దీంతో న్యాయస్థానం నవంబర్ 1వ తేదీ వరకు విచారణను వాయిదా వేసింది. ఈ ఏడాది జూలై 19న సీబీఐ, ఈడీ తమ ఛార్జీషీట్లలో చిదంబరం, ఆయన కొడుకు కార్తి చిదంబరంల పేర్లను ప్రస్తావించింది.

English summary
A Delhi court on Monday extended till November 1 the interim protection from arrest granted to former Union minister P. Chidambaram and his son Karti in the Aircel-Maxis case filed by the Central Bureau of Investigation (CBI) and the Enforcement Directorate (ED).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X