దేశవ్యాప్తంగా చిన్నారుల మరణాలు..ఆ దగ్గుమందే కారణమా..?
మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో చిన్నారుల వరుస మరణాలు.. అనారోగ్య సంఘటనలు చోటుచేసుకోవడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనలకు కారణమని అనుమానిస్తున్న దగ్గు సిరప్‌లపై అధికారులు తక్షణ చర్యలు చేపట్టి వాటి పంపిణీని నిలిపివేశారు.
మధ్యప్రదేశ్‌లో ఆరుగురు చిన్నారుల మృతి..
మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా జిల్లాలో ఆగస్టు 24 నుండి సెప్టెంబర్ వరకు ఆరుగురు పిల్లలు దగ్గు సిరప్ వాడిన తర్వాత కిడ్నీ ఇన్ఫెక్షన్లకు గురై మృతి చెందారు. చనిపోయిన వారిలో జ్వరం, మూత్ర సమస్యలు ప్రధాన లక్షణాలుగా కనిపించాయని చెబుతున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు "కోల్డ్‌రిఫ్", "నెక్స్‌ట్రో-డీఎస్" సిరప్‌ల వినియోగాన్ని నిషేధించారు.

రాజస్థాన్‌లో కూడా ప్రభావం..
అలానే రాజస్థాన్‌లోని సికర్ జిల్లాలో రాష్ట్ర ఉచిత వైద్య పథకం కింద సరఫరా చేసిన డెక్స్‌ట్రోమెథోర్ఫాన్ హైడ్రోబ్రోమైడ్ దగ్గు సిరప్ వాడిన తర్వాత ఐదేళ్ల బాలుడు మరణించాడు. భరత్‌పూర్‌లో మూడేళ్ల బాలుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. సంగనేర్‌లో రెండేళ్ల బాలిక కూడా విషమించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఈ మేరకు రాజస్థాన్ మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (RMSCL) జైపూర్‌కు చెందిన కైసన్స్ ఫార్మా తయారు చేసిన బ్యాచ్ నంబర్లు KL-25/147, KL-25/148పై విచారణ ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ బ్యాచ్‌ల పంపిణీ నిలిపివేసింది.
ప్రాథమిక నివేదికల ప్రకారం, ఈ సిరప్ పిల్లలకు అనుకూలం కాదని తేలింది. నాలుగేళ్లలోపు చిన్నారులే ఎక్కువగా ప్రభావితమయ్యారు. వైద్య నిపుణులు హెచ్చరిస్తూ ఐదేళ్లలోపు పిల్లలకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎటువంటి దగ్గు సిరప్ ఇవ్వకూడదని సూచించారు.
మరోవైపు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) మధ్యప్రదేశ్‌లో నమూనాలను సేకరించింది. రాజస్థాన్ డ్రగ్ కంట్రోలర్ అజయ్ ఫాటక్ ప్రకారం.. ప్రభావిత బ్యాచ్‌ల నుండి నమూనాలను నాణ్యతా పరీక్షల కోసం పంపారు. ఐదు నుండి ఆరు రోజుల్లో తుది నివేదిక వెలువడనుంది.
గతంలోనూ ఇలాంటి ఘటనలు..
భారతీయ కంపెనీలు తయారు చేసిన దగ్గు సిరప్‌ల వల్ల గాంబియా, ఉజ్బెకిస్థాన్‌లలో చిన్నారులు మరణించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఇప్పుడు ప్రభుత్వ ఆరోగ్య పథకాల కింద సరఫరా చేసే అన్ని మందులకు కఠినమైన ల్యాబ్ టెస్టులు తప్పనిసరి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఔషధ నాణ్యత నియంత్రణ విధానాలను పునర్విమర్శించాలని కేంద్రం ఆదేశించింది.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications