• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చైనా వక్రబుద్ధి .. భారత వెబ్ సైట్లపై చైనా హ్యాకర్ల పంజా ..300 శాతంపెరిగిన దాడులు

|

ఇండియా చైనా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియా 59 చైనాయాప్స్ ను బ్యాన్ చేసింది. ఇండియన్ వెబ్ సైట్లను, పత్రికలను నిషేధిస్తూ చైనా రివర్స్ ఎటాక్ మొదలు పెట్టింది. ఇండియా చైనాకు గుణపాఠం నేర్పాలని ఆగ్రహావేశాలతో ఊగిపోతుంది. ప్రతీకారం కోసం తన వక్ర బుద్ధి పోనివ్వకుండా హ్యాకర్లను రంగంలోకి దింపిందని తాజా సమాచారం.

చైనా క్యాబేజీ వ్యూహం .. ఇండియాతోనూ అదే స్ట్రాటజీ ..ఇప్పటివరకు డ్రాగన్ కంట్రీ ఆక్రమణల గుట్టు ఇదే..

భారతదేశం పై విరుచుకు పడుతున్న చైనీస్ హ్యాకింగ్ కమ్యూనిటీలు

భారతదేశం పై విరుచుకు పడుతున్న చైనీస్ హ్యాకింగ్ కమ్యూనిటీలు

చైనీస్ హ్యాకింగ్ కమ్యూనిటీలు భారతదేశం పై విరుచుకు పడే పరిస్థితి ఉందని సైబర్ ఇంటిలిజెన్స్ సంస్థ సైఫిర్మా ఇప్పటికే నివేదించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే చైనా హ్యాకర్లు రెచ్చిపోతున్నారు . ఇప్పటివరకు ఈ రెండు వారాల్లో భారత వెబ్ సైట్లపై జరుగుతున్న దాడులు 300 శాతం వరకూ పెరిగాయని సింగపూర్ కు చెందిన సైబర్ రీసెర్చ్ సైఫిర్మా పేర్కొంది. చైనా హ్యాకర్ల దాడులు మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రభుత్వ వెబ్ సైట్ లపై కూడా దాడులకు తెగబడనుందని, అప్రమత్తంగా ఉండటం అవసరం అని, భారీ స్థాయిలో హ్యాకింగ్స్ పెరిగాయని సంస్థ సీఎండీ రితేశ్ కుమార్ తెలిపారు.

కీలక వెబ్ సైట్స్ టార్గెట్ గా డేటా చోరీ ... సైబర్ దాడులు

కీలక వెబ్ సైట్స్ టార్గెట్ గా డేటా చోరీ ... సైబర్ దాడులు

ఈ సమాచారాన్ని తాము భారత ప్రభుత్వ సీఈఆర్టీ (కంప్యూటర్ అత్యవసర రెస్పాన్స్ టీమ్)తో చెప్పామని అన్నారు. చైనీస్ హ్యాకర్లు పేట్రేగిపోతున్నారని, వారు వివిధ వెబ్ సైట్ లకు సంబంధించి కీలక సమాచారం తస్కరిస్తున్నారని , వినియోగదారుల వివరాలు సేకరిస్తున్నారని , అంతేకాదు ఆపై సైబర్ దాడులకు దిగుతున్నారని పేర్కొన్నారు. భారతీయ పత్రిక, మీడియా సంస్థలు, వెబ్ సైట్లు, రక్షణ వ్యవస్థ తో పాటు, ప్రభుత్వ వెబ్సైట్లు, టెలికాం మరియు స్మార్ట్ ఫోన్లు, ఫార్మాలోని పలు సంస్థలను టార్గెట్ గా చేసుకుని హ్యాకర్స్ రెచ్చిపోతున్నారని పేర్కొన్నారు.

వక్రబుద్ధి పోనివ్వని చైనా ... హ్యాకర్లను ఉసిగొల్పి సైబర్ ఎటాక్స్

వక్రబుద్ధి పోనివ్వని చైనా ... హ్యాకర్లను ఉసిగొల్పి సైబర్ ఎటాక్స్

భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలు పెరిగేకొద్దీ, చైనా మీడియా హ్యాకింగ్ కమ్యూనిటీలు భారతీయ మీడియా, ఫార్మా టెలికమ్యూనికేషన్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడుతున్నాయి. ఒక చైనీస్ హ్యాకింగ్ గ్రూపులలో దాదాపు 93 శాతం మందికి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ లేదా చైనా బాహ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిధులు సమకూరుస్తుంది అన్నది సమాచారం. ప్రపంచ దేశాల్లోనే అతి పెద్ద హ్యాకింగ్ కమ్యూనిటీలు ఉన్న చైనా ఇండియాను దెబ్బ తీయటం కోసం దొంగ దారి ఎంచుకుంది అందులో భాగంగానే హ్యాకర్లను ఉసిగొల్పుతుంది .

హ్యాకర్లకు అండగా చైనా ప్రభుత్వం... నేరుగా చైనా నుండే హ్యాకింగ్

హ్యాకర్లకు అండగా చైనా ప్రభుత్వం... నేరుగా చైనా నుండే హ్యాకింగ్

ఇంతకు ముందు పాకిస్తాన్ , ఉత్తరకొరియాలకు చెందిన హ్యాకర్ల ద్వారా దాడులు జరిపే చైనా ఇప్పుడు ఏకంగా తమ రాజధాని బీజింగ్ తో పాటు గ్వాంగ్ ఝో, షెన్ జన్, చెంగ్డూ తదితర నగరాల నుంచి దాడులు చేస్తోంది. దీనికి చైనా ప్రభుత్వం కూడా అండగా నిలుస్తోందని నిఘా సంస్థ నిర్ధారించింది . చైనా ఆర్మీకి చెందిన ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను వినియోగించుకుంటున్న గోధిక్ పాండా, స్టోన్ పాండా హ్యాకింగ్ ఏజన్సీలు, గతంలో యూఎస్, యూరప్ తదితర దేశాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తుండేవని,కానీ ఇప్పుడు నేరుగా చైనా నుంచే దాడులు జరుపుతున్నారని తెలిపారు.

  #IndiaChinaStandoff:సరిహద్దుల్లో భారత్ T-90 భీష్మా యుద్ధ ట్యాంకర్లు.. సమయం లేదు చైనా.. శరణమా రణమా ?
   అలెర్ట్ ఇండియా ... తీవ్ర నష్టం జరిగే అవకాశం

  అలెర్ట్ ఇండియా ... తీవ్ర నష్టం జరిగే అవకాశం

  చైనా హ్యాకర్లు మాట్లాడుకునే మాటలను డీకోడ్ చేశామని ఇండియాకు గుణపాఠం చెప్పాలన్నదే వీరి లక్ష్యంగా ఉందని అర్థమవుతోందని రితేశ్ వ్యాఖ్యానించారు. చైనీస్ హ్యాకింగ్ కమ్యూనిటీ కోసం దాదాపు మూడు లక్షల పద్నాలుగు వేల మంది పని చేస్తున్నారని అనుమానిస్తున్న నేపధ్యంలో అలెర్ట్ ఇండియా అంటున్నారు. ఒకపక్క ఇండియా కూడా చైనా విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇక డిజిటల్ వార్ లో ఇండియాలో అలెర్ట్ గా ఉండకుంటే తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది.

  English summary
  According to Singapore-based cybersecurity research firm Saifirma, the number of attacks on Indian websites has soared by 300 percent in the past two weeks. Chinese hacker attacks are likely to escalate, and there is a need to be vigilant.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more