వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌ను మళ్లీ దెబ్బకొట్టిన చైనా: శాటిలైట్ ఫొటోలు: దేశ సరిహద్దుల్లో గ్రామం..పేరు కూడా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ సరిహద్దుల్లో తరచూ ఉల్లంఘనలకు పాల్పడుతూ భారత్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న చైనా.. మరోసారి తన తెంపరితనాన్ని ప్రదర్శించింది. లఢక్ వద్ద నెలల తరబడి లక్షల సంఖ్యలో సైన్యాన్ని మోహరింపజేసి, తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణానికి తెర తీసిన డ్రాగన్ కంట్రీ- ఇప్పుడు మళ్లీ అలాంటి దుశ్చర్యలకు తెగబడింది. మరోసారి తన వివాదాస్పద వైఖరిని చాటుకుంది.

 అరుణాచల్ తరహాలో..

అరుణాచల్ తరహాలో..

ఇదివరకు అరుణాచల్ ప్రదేశ్ వద్ద సరిహద్దుల్లో గ్రామాన్ని నిర్మించిన చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనిక బలగాలు.. ఇప్పుడు తాజాగా సిక్కిం సరిహద్దులపై దృష్టి సారించాయి. డోక్లామ్ సరిహద్దుల వద్ద పూర్తిస్థాయి గ్రామాన్ని అతి తక్కువ సమయంలో నిర్మించింది. దీనికి పంగ్డా అనే పేరు సైతం పెట్టింది. పీఎల్ఏ సైనిక బలగాలు ఈ గ్రామాన్ని వినియోగించుకుంటోన్నాయి. అక్కడే నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాయనే ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి.

డోక్లామ్ వద్ద గ్రామం..

డోక్లామ్ వద్ద గ్రామం..

డోక్లామ్ పీఠభూమి సరిహద్దులకు అతి సమీపంలో ఈ గ్రామం నిర్మితం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత్-చైనా-భూటాన్ ట్రైజంక్షన్‌ దగ్గరగా పంగ్డా విలేజ్‌ను నిర్మించింది. ఈ గ్రామం నుంచి భారత్-చైనా సరిహద్దు తొమ్మిది కిలోమీటర్ల దూరం మాత్రమే. ఇక్కడ చైనా సైనికులు మకాం వేయడం చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన శాటిలైట్ ఫొటోలను మక్సర్ అనే సంస్థ విడుదల చేసింది. ఎన్డీటీవీ వెబ్‌సైట్ దీన్ని ప్రత్యేకంగా ప్రచురించింది.

శాటిలైట్ ఫొటోలు..

శాటిలైట్ ఫొటోలు..

పంగ్డా విలేజ్‌లో ఉన్న ఇళ్ల ముందు వాహనాలు కూడా పార్క్ చేసి ఉండటం ఈ శాటిలైట్ ఫొటోల్లో స్పష్టంగా రికార్డయింది. వాటిని సైనిక వాహనాలుగా భావిస్తోన్నారు. భూటాన్‌కు చెందిన భూభాగాన్ని కూడా ఆక్రమించుకున్నట్లు తేలింది. ఆ దేశం మీదుగా ప్రవహించే అమో చు నదీ తీరం వెంబడి ఈ శాశ్వత కట్టడాలు, నివాసాలు నిర్మించినట్లు స్పష్టమైంది. చైనా ఈ గ్రామాన్ని నిర్మించడం ద్వా- భారత్‌ను అనుసంధానించే సిలిగురి కారిడార్‌ రహదారిని ఆక్రమించినట్టయిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

2017 నుంచీ..

2017 నుంచీ..

2017లో చైనాకు చెందిన పీఎల్ఏ సైనిక బలగాలు భారత భూభాగంపైకి చొచ్చుకుని రావడానికి ప్రయత్నించగా.. సరిహద్దు భద్రత జవాన్లు అడ్డుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో ఇది తీవ్ర ఉద్రిక్త పరిస్థితులను దారి తీసింది. రోజుల తరబడి రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగింది. రెండు దేశాల సైనికులు పరస్పరం తోసుకున్న సందర్భాలు అప్పట్లో తరచూ సంభవించాయి. 72 రోజుల అనంతరం పీఎల్ఏ బలగాలను వెనకడుగు వేశాయి.

 లఢక్‌పైనా..

లఢక్‌పైనా..


దాని తరువాతే లఢక్ వరుస సంఘటనలు సంభవించాయి. లఢక్‌ సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద కూడా చైనా సైన్యం ఇలాంటి దుందుడుకు వైఖరిని ప్రదర్శించిన విషయం తెలిసిందే. గ్యాలన్ వ్యాలీ వద్ద రెండు దేశాల సైనికుల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ చోటు చేసుకుంది. 20 మంది భారత జవాన్లు అమర వీరులయ్యారు. చైనా తరఫు కూడా భారీగా ప్రాణనష్టం సంభవించినట్లు వార్తలొచ్చినప్పటికీ.. దాన్ని ఆ దేశం ధృవీకరించలేదు.

English summary
New Satellite images shows that the China has built a full-fledged village near Doklam and named it as Pangda.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X