ఎల్ఏసీ దాటిన చైనా జవాను: ఖాళీ పెన్ డ్రైవ్, మొబైల్, స్లీపింగ్ బ్యాగ్..
భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. తూర్పు లడాఖ్ వద్ద బలగాల మొహరింపు కంటిన్యూ అవడంతో పరిస్థితిలో ఏమాత్రం మార్పులేదు. అయితే వాస్తవ నియంత్రణ రేఖ దాటి ఓ చైనా సైనికుడు భారత భూభాగంలో వచ్చాడు. దీంతో ఉత్కంఠ నెలకొంది.
అతని వద్ద ఖాళీగా ఉన్న పెన్ డ్రైవ్ కూడా ఉంది. దీంతో మరింత అనుమానాలు వస్తున్నాయి. మొబైల్ ఫోన్, స్లీపింగ్ బ్యాగ్ కూడా ఉంది అని 'ఆజ్ తాక్' రిపోర్ట్ చేసింది. ఇప్పుడే కాదు ఈ నెల 19వ తేదీన కూడా ఆర్మీ సిబ్బంది నిలిపివేశారు. అతనివద్ద చైనా మిలిటరీ అని ధృవీకరిచే పత్రం ఉంది అని భారత భద్రతా దళాలు పేర్కొన్నాయి. అతనిని డెమ్‌చాక్ వద్ద పట్టుకున్నామని వెల్లడించాయి.

జవాను.. కార్పొరల్ వాంగ్‌ను భారత ఆర్మీ సిబ్బంది ప్రశ్నించారు. అతని అప్పగింతకు సంబంధించి ప్రోటోకాల్ ప్రకారం నడుచుకుంటామని అధికారులు తెలిపారు. చైనా సైనికుడికి ఆక్సిజన్ అందించామని.. ఆహారం ఇచ్చి.. వెచ్చని దుస్తులు అందజేసి, వైద్యం సాయం చేశామని పేర్కొన్నారు. ఎత్తులో కఠినమైన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అతను ఉన్నాడని.. సాయం చేశామని పేర్కొన్నారు.
అయితే తప్పిపోయిన సైనికుడు కార్పొరల్ వాంగ్ గురించి చైనా సైనికుల నుంచి తమకు సమాచారం వచ్చిందని తెలిపారు. అప్పగింతకు సంబంధించి ఫార్మాలిటీ పూర్తిచేసి.. ఇస్తామని పేర్కొన్నారు. తూర్పు లడాఖ్ వద్ద ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దుల్లో ఇరు దేశాల బలగాలను మొహరించడంతో.. ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications