చైనా కట్టడిలో భారత్ వెంటే యూరప్.. మోదీతో ఈయూ నేతలు.. వాణిజ్య ఒప్పందాలపై ఇలా..

పొరుగుదేశాలతో గిల్లికజ్జాలు పెట్టుకుంటోన్న చైనా చర్యలపై ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేక వ్యక్తమవుతున్నది. భారత సరిహద్దులో మొన్నటిదాకా అది అనుసరించిన తీరును అంతర్జాతీయ సమాజం తప్పుపడుతున్నది. డ్రాగన్ దేశాన్ని కట్టడి చేయడంలో భారత్ వెన్నంటి ఉంటామని యురోపియన్ యూనియన్ సైతం స్పష్టం చేసింది. ఇప్పటికే అమెరికా, బ్రిటన్ లాంటి అగ్రదేశాలన్నీ మనకు మద్దతు పలికిన సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక ఇండియా-యురోపియన్ యూనియన్(ఈయూ) 15వ సదస్సులో ఈ మేరకు చైనా దురాగతాలపై చర్చ జరిగినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం జరిగిన ఇండియా-ఈయూ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. భారత ప్రతినిధి బృందానికి ఆయన నాయకత్వం వహించగా, యురోపియన్ యూనియన్ నుంచి.. 'యురోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్' చార్లెస్ మైకెల్, 'యురోపియన్ కమిషన్ ప్రెసిడెంట్' ఉర్సులా వాన్ డెర్ లెయాన్ ప్రాతినిధ్యం వహించారు. ఇరువురి మధ్య ఆర్థిక, సాంస్కృతిక బంధాలను పెంపొందించుకోవాలని నేతలు నిర్ణయించారు. కాగా, సదస్సు వివరాలను విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ మీడియాకు వెల్లడించారు.

Chinese aggressiveness discussed at India-EU Summit, says MEA

''చైనా అంశంపై మేం చర్చించాం. సరిహద్దులో జరిగిన సంఘటలు, తాజా పరిణామాల గురించి ప్రధాని మోదీ మాకు తెలియజేశారు. దౌత్య మార్గంలోనే భారత్ ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకున్న తీరు నిజంగా అభినందనీయం. భారత్ కు మేం మద్దతు ఇస్తున్నాం''అని 'యురోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్' చార్లెస్ మైకెల్ మీడియాతో అన్నారు. ఇండియా-ఈయూ సదస్సులో చైనా అంశంపైనా చర్చ జరిగినట్లు విదేశాంగ శాఖ నిర్ధారించింది. ఇక అతికీలకమైన విషయాలకొస్తే...

Chinese aggressiveness discussed at India-EU Summit, says MEA

ఇండియా-యురోపియన్ యూనియన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల ఒప్పందం (బీటీఐఎ)కు సంబంధించి నిర్ధిష్ట కాలపరిమితి అంటూ విధించుకోలేదని, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నేతలు నిర్ణయించుకున్నారని విదేశాంగ ప్రతినిధి వికాస్ స్వరూప్ చెప్పారు. ''ఇరు పక్షాల నాయకులు తమ ఆసక్తిని, నిబద్ధతను తెలియజేశారు. విభిన్న రంగాలలో సంబంధాలు, విదేశాంగ విధానం, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారం తదితర అంశాలను కొత్త ఫ్రేమ్ వర్క్ లో మెరుగుపర్చుకోవాలని, 2025 వరకు రోడ్ మ్యాప్ రూపొందించుకుందామని నిర్ణయించుకుననారు'' అని స్వరూప్ వివరించారు. భారత్-ఈయూ సహజ మిత్రులని, కీలక రంగాల్లో మరింత సహకరించుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ సదస్సులో పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+