+86తో జాగ్రత్త! వాట్సాప్ గ్రూపులపై చైనా హ్యాకర్ల నజర్, భారత ఆర్మీ హెచ్చరిక
న్యూఢిల్లీ: దేశంలో వాట్సాప్ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని భారత ఆర్మీ హెచ్చరించింది. భారత యూజర్లే లక్ష్యంగా చైనాకు చెందిన కొందరు హ్యాకర్లు వాట్సాప్‌ను హ్యాక్ చేసి వ్యక్తిగత సమాచారాన్ని దోచేస్తున్నారని పేర్కొంది. ఈ మేరకు ట్విటర్‌లో ఓ వీడియోను కూడా పోస్టు చేసింది.
'చైనీయులు డిజిటల్ ప్రపంచంలోకి కూడా చొచ్చుకు వస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి..' అని భారత ఆర్మీకి చెందిన అడిషనల్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇంటర్‌ఫేస్(ఏడీజీపీఐ) ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు.

వాట్సాప్ గ్రూప్‌లను హ్యాక్ చేసి వివరాలను దొంగలిస్తున్నట్లు ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. +86తో ప్రారంభమయ్యే నంబరు ఏదైనా గ్రూప్‌లో చేరితో అటువంటి నంబర్లతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అంతేగాక మొబైల్ నంబర్లు మార్చినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని, పాత సిమ్‌ను పూర్తిగా పనిచేయకుండా విరగ్గొట్టాలని స్పష్టం చేశారు.
గతంలోనూ చైనా హ్యాకర్ల గురించి ఆర్మీ కొన్ని హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. వాస్తవాధీన రేఖ వెంబడి విధులు నిర్వర్తిస్తున్న జవాన్లు కొన్ని యాప్‌లను ఉపయోగించవద్దని, వాటిని చైనీయులు హ్యాక్ చేస్తున్నారని హెచ్చరికలు జారీ చేసింది.
सजग रहे,सतर्क रहें,सुरक्षित रहें।#भारतीयसेना सोशल मीडिया उचित एवं नियमबद्ध एकाउंट को प्रोत्साहित करता है। हैकिंग जोरो पर है, उनके लिए जो असावधान हैं। अपने सोशल मीडिया को हमेशा चेक करें। व्यक्तिगत एवं ग्रुप एकाउंट के बारे में सावधान रहें, सुरक्षित रहें। @DefenceMinIndia @PIB_India pic.twitter.com/YQbdVFsmWe
— ADG PI - INDIAN ARMY (@adgpi) March 18, 2018












Click it and Unblock the Notifications