మోడీపై చైనా నెటిజన్ల ప్రశంసలు: భారీగా ఫాలోవర్స్, తమ ఇంటికి రమ్మంటూ ట్వీట్లు
న్యూఢిల్లీ/బీజింగ్: భారత ప్రధాని నరేంద్ర మోడీపై చైనా నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. చైనాలోని ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ వైబోలో మోడీ ఖాతా ప్రారంభించి, చైనీయుల భాషలో ట్వీట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.
కాగా, వైబోలో ఖాతా ప్రారంభించిన మూడు రోజుల్లోనే మోడీ ఖాతాకు 42,170మంది ఫాలోవర్లు చేరిపోయారు. వైబోలో మోడీ చేరడం పట్ల చైనా నెటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు. కొందరు ఆయనను తమ ఇళ్లకు రమ్మంటూ ఆహ్వానాలు కూడా పంపిస్తున్నారు.
మే 5న వైబోలో ఖాతా ప్రారంభించిన మోడీ.. పలు ట్వీట్లను చైనా భాషలో కూడా చేశారు. మే 14 నుంచి 16వ తేదీ వరకు చైనాలో పర్యటించనున్నట్లు కూడా ఆయన వైబోలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

‘1984లో అంతరిక్షంలో తొలిసారి అడుగుపెట్టిన రాకేష్ శర్మ గురించి చాలా మంది చైనీయులకు తెలియదు. చైనా-భారత్ సంబంధాలకు మీడియానే ప్రధాన అవరోధంగా మారుతోంది. ఇరుదేశాలకు విరుద్ధమైన సమాచారం ఇస్తోంది' అని ఫ్లైయింగ్‌హైబియర్ అనే పేరుతో సింగపూర్ నుంచి ఓ పోస్ట్ వచ్చింది.
‘ప్రధాని నరేంద్ర మోడీ చైనా పర్యటన చైనా-భారత్‌ల మధ్య సత్ససంబంధాలను నెలకొల్పుతుందని ఆకాంక్షిస్తున్నా. మీడియా కూడా తప్పుగా అర్థం చేసుకోకుండా ఇరుదేశాల మధ్య సుహృద్భావ వాతావరణం కలిగేందుకు సహకరించాలి' అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.
-
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!!












Click it and Unblock the Notifications