అరుణాచల్ ప్రదేశ్‌లోకి చైనా రోడ్డు బిల్డింగ్ టీమ్, బుల్డోజర్లు స్వాధీనం చేసుకున్న భారత్
ఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌ను తమ భూభాగంగా చెబుతున్న చైనా మరోసారి రెచ్చిపోయింది. అరుణాచల్ ప్రదేశ్ ఉనికిని ఇప్పటి వరకూ గుర్తించలేదని వ్యాఖ్యానించింది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
డోక్లాం వివాదాన్ని పూర్తిగా మర్చిపోకముందే చైనా మరోసారి బరి తెగించడం గమనార్హం. భారత భూభాగంలో రోడ్డు నిర్మాణానికి ప్రయత్నించింది. మెక్‌మోహన్ రేఖ దాటి అరుణాచల్ ప్రదేశ్‌లోకి చొరబడిన చైనా బలగాలు.. మన భూభాగంలో రోడ్డు నిర్మాణానికి పూనుకున్నాయి. దీన్ని భారత బలగాలు అడ్డుకోవడంతో అప్పర్ షియాంగ్ జిల్లాలోని బిషింగ్ వద్ద ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.

బుల్డోజర్ల సాయంతో చైనా రోడ్డు నిర్మాణం చేపడుతోందని స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఇండో టిబటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) అప్రమత్తమైంది. భారత బలగాలు అక్కడ పెద్ద ఎత్తున మోహరించాయి. చైనాకు చెందిన రెండు బుల్డోజర్లను భారత్ స్వాధీనం చేసుకుందని తెలుస్తోంది.
అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమని ఎప్పటి నుంచో వాదిస్తోన్న చైనా డిసెంబర్ 28న ఈ రోడ్డు నిర్మాణానికి పూనుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో యార్లూంగ్ త్సాంగ్‌పో నదికి ఉత్తరాన ఉన్న మెడాగ్ ప్రాంతంలో భారత్ బలగాలను మోహరించింది. అక్కడి నుంచి వెళ్లాలని చైనా బలగాలకు హితవు పలికింది.
చైనా సైన్యం తిరస్కరించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో భారత సైన్యం అక్కడికి బలగాలను పంపింది. ఈ ప్రాంతాన్ని ఐటీబీపీ బలగాలు పహారా కాస్తున్నప్పటికీ ఆర్మీని భారీగా మోహరించారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications