పద్మ అవార్డులు అందుకున్న చినజీయర్ స్వామి, కీరవాణి, ప్రముఖులు

న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల ప్రదానోత్సవం రెండో విడత బుధవారం జరిగింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ అవార్డులను ప్రదానం చేశారు.

Padma awards ceremony 2nd session

ఈ ఏడాది మొత్తం 106 పద్మపురస్కారాలను కేంద్రం ప్రకటించగా.. మార్చి 22న తొలి విడతలో 50 మందికిపైగా పద్మ అవార్డులు ప్రధానం చేశారు. తాజాగా, బుధవారంసాయంత్రం మిగిలిన వారందరికీ పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలను అందజేశారు. దివంగత నేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్‌కు కేంద్రం ప్రకటించిన పద్మవిభూషణ్‌ను ఆయన తనయుడు, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అందుకున్నారు.

 keeravani gets padma shri

ఇక తెలుగు రాష్ట్రాల నుంచి త్రిదండి చినజీయర్ స్వామి పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పద్మశ్రీ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతులమీదుగా అందుకున్నారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. వీరితోపాటు పలువురు ప్రముకులు పద్మ అవార్డులను స్వీకరించారు.

chinna jeeyar swamy received padma bhushan

ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని నరేంద్ర మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాటోపాటు పలువురు కేంద్రమంత్రులు, ప్రముఖుుల పాల్గొన్నారు. ఈ అవార్డుల ప్రధానోత్సవానికి కీరవాణి కుటుంబంతోపాటు ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కుటుంబసభ్యులు హాజరయ్యారు.

కాగా, గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 106 పద్మ పురస్కారాలు ప్రకటించగా.. వీటిలో ఆరుగురికి పద్మ విభూషణ్, 9 మందికి పద్మభూషణ్, 91 మందికి పద్మశ్రీ అవార్డులు లభించాయి. ఈసారి తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన 12 మందిని పద్మ అవార్డులు వరించాయి. ఆధ్యాత్మిక రంగంలో చినజీయర్ స్వామి, కమలేష్ డి పటేల్ లను పద్మభూషణ్ పురస్కారాలు వరించాయి. కీరవాణితోపాటు ఏపీకి చెందిన ఏడుగురికి, తెలంగాణకు చెందిన ముగ్గురికి పద్మశ్రీ అవార్డులు వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+