Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చెన్నై: బలౌతున్నారని చిరు ఆవేదన: బాబుకు విజ్ఞప్తి

చెన్నై: స్థానికంగా ఉపాధి లేక కార్మికులు భారీగా పొరుగు ప్రాంతాలకు వచ్చి ఇలాంటి దుర్ఘటనలకు బలవుతున్నారని మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత చిరంజీవి సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన తమిళనాడులోని చెన్నైలో భవనం కూలిన ప్రదేశాన్ని మాజీ పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణతో కలిసి సందర్శించి.. బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే భవనం కుప్పకూలిందని చిరంజీవి అన్నారు. కారకులను కఠినంగా శిక్షించాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించి కార్మికుల వలసలను అరికట్టాలని కోరారు. మృతులకు పదిలక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

Chiranjeevi visits Chennai

22కు చేరిన మృతులు

చెన్నైలో భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 22కు చేరుకుంది. 24 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు తమిళనాడు ప్రభుత్వం తమ రాష్ట్రానికి చెందిన మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని పెంచింది.

ఇప్పటి వరకు వెలికి తీసిన మృతుల్లో నలుగురు తమిళనాడువాసులు ఉన్నారు. గతంలో రెండు లక్షల రూపాయలు ప్రకటించిన ప్రభుత్వం.. ఇప్పుడు సీఎం సహాయ నిధి నుండి మరో ఐదు లక్షల రూపాయలు కలిపి మొత్తం రూ.7 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+