బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

King Pin: ఎస్ఐ ఉద్యోగాలు ఎవ్వరికి ఊరికే రావు, స్కామ్ కేసులో ట్విస్ట్, బెయిల్ తో వచ్చి ?

సబ్ ఇన్స్ పెక్టర్ ఉద్యోగాల స్కామ్ కేసులో ప్రధాన నిందితుడు, ఈ స్కెమ్ కింగ్ పిన్ కు సీఐడీ అధికారులు సినిమా చూపిస్తున్నారు. పోలీసు శాఖలో, అది ఎస్ఐ ఉద్యోగాలా స్కామ్ కు స్కెచ్ వేసి అనేక మంది జీవితాలతో చెలగాటం ఆడిన అనేక మంది ఇ

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: సబ్ ఇన్స్ పెక్టర్ ఉద్యోగాల స్కామ్ కేసులో ప్రధాన నిందితుడు, ఈ స్కెమ్ కింగ్ పిన్ కు సీఐడీ అధికారులు సినిమా చూపిస్తున్నారు. పోలీసు శాఖలో, అది ఎస్ఐ ఉద్యోగాలా స్కామ్ కు స్కెచ్ వేసి అనేక మంది జీవితాలతో చెలగాటం ఆడిన అనేక మంది ఇప్పటికే జైలుపాలైనారు. అధికార పార్టీ , ప్రతిపక్ష పార్టీల నాయకులతో పాటు సీనియర్ పోలీసు అధికారులు సైతం ఎస్ఐ ఉద్యోగాల నియాకం కేసులో అరెస్టు అయ్యారు. కొంత మందికి బెయిల్ రావడంతో బయటకు వచ్చారు. ఇంకా బెయిల్ రానివాళ్లు జైల్లోనే ఉన్నారు. పరీక్షా కేంద్రాల్లో వీళ్లు చేసిన స్కామ్, కోట్ల రూపాయలు చేతులు మారాయని వెలుగు చూడటంతో ఎస్ఐ ఉద్యోగాల స్కామ్ ప్రభుత్వాన్నే కుదిపేసింది. ఈ కేసులో బెయిల్ మీద బయటకు వచ్చిన వ్యక్తి నోటీసులు ఇచ్చినా తప్పించుకుని తిరగడం హాట్ టాపిక్ అయ్యింది.

Wife: రెండో భార్య నిషాతో ?, భార్య, పిల్లలను చంపేసి ఇంట్లో పూడ్చేసి శవాల మీద రైల్వే ఉద్యోగి, టైల్స్ తో !Wife: రెండో భార్య నిషాతో ?, భార్య, పిల్లలను చంపేసి ఇంట్లో పూడ్చేసి శవాల మీద రైల్వే ఉద్యోగి, టైల్స్ తో !

 ఎస్ఐ ఉద్యోగాల కోసం పరీక్షలు

ఎస్ఐ ఉద్యోగాల కోసం పరీక్షలు

కర్ణాటకలో జరిగిన ఎస్ఐ ఉద్యోగాల రాతపరీక్షల్లో గోల్ మాల్ జరగడంతో ఆ పరీక్షలు రద్దు చేశారు. ఇదే సమయంలో పోలీసు శాఖలోని ఎస్ఐ ఉద్యోగాల రాతపరీక్షల స్కామ్ బయటకు రావడంతో ప్రతిపక్షాలు అధికార పార్టీ నాయకుల మీద దుమ్మెత్తిపోశాయి. నిజాయితీగా కష్టపడి పరీక్షలు రాసిన చాలా మందికి ఈ ఎస్ఐ ఉద్యోగాల నియామకం పరీక్షల్లో అన్యాయం జరిగిందని బహిరంగంగా విమర్షలు ఎదరైనాయి.

 పారిపోలేదు అని ఓ వీడియో విడుదల చేసి ?

పారిపోలేదు అని ఓ వీడియో విడుదల చేసి ?

ఎస్ఐ రిక్రూట్‌మెంట్ పరీక్ష స్కామ్ కింగ్‌పిన్ ఆర్ డీ, పాటిల్ అలియాస్ ఆర్ కి బెంగళూరులోని సీఐడీ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రకాష్ రాథోడ్ నోటీసులు జారీ చేశారు.

ఇటీవల సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఆర్ డీ పాటిల్ వీడియోలో పాటిల్ ఇచ్చిన సందేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత సీఐడీ అధికారులు ఈ నోటీసు జారీ చేశారు. నేను ఎక్కడికీ పారిపోలేదు, ఇక్కడే ఉంటున్నాను. దేశంలోని చట్టాన్ని గౌరవిస్తానని ఆర్ డీ పాటిల్ ఆ వీడియోలో చెప్పారు.

 ఎక్కడ ఉన్నారు సార్ ?

ఎక్కడ ఉన్నారు సార్ ?

వీడియోలో చెప్పిన ఆర్ డీ పాటిల్ కు చట్ట ప్రకారం ఇప్పటికే 4 నోటీసులు ఇచ్చినా ఎందుకు ఆయన మా ముందుకు రావడం లేదని పోలీసు అధికారులు ప్రశ్నించారు. మీ ఇంటికి వెళ్లి జనవరి 21వ తేదీన రోజంతా మీకోసం వేచి చూసి నోటీసులు ఇవ్వాలని ప్రయత్నించాము, ఆ రోజు మీరు అడ్రస్ లేరు. మిమ్మల్ని సంప్రదించాలని ప్రయత్నిస్తే మీ మొబైల్ ఫోన్ నెంబర్ నాట్ రీచబుల్ అని వస్తోందని సీఐడీ పోలీసు అధికారుు అంటున్నారు.

 అందుకే నోటీసులు ఇచ్చాము

అందుకే నోటీసులు ఇచ్చాము

మీరు మీ ఇంటిో కనిపించలేదు, మీ ఇంటికి వెళ్లేసరికి ఇంటికి తాళం వేసి ఉంది, ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ ఇంటి దగ్గర ఉన్నారు మీరు రాలేదు. ఈ నేపథ్యంలోమరోసారి జనవరి 23వ తేదీ ఉదయం 11 గంటలకు కలబురగి నగర్‌లోని ఇవాన్‌ ఎ షాహీ గెస్వి హౌస్‌లోని క్యాంపు కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఎంబీ పాటిల్ కు సీఐడీ పోలీసు అధికారి ప్రకాష్‌ రాథోడ్‌ నోటీసులు జారీ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

 ఇక్కడే ఉన్నాను అంటే మా ముందుకు రావాలి కదా ?

ఇక్కడే ఉన్నాను అంటే మా ముందుకు రావాలి కదా ?

కలబురగి నగర్‌లోని చౌక్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్ఐ ఉద్యోగాల స్కామ్ కు సంబంధించి కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో ఆర్‌డి పాటిల్‌ ప్రధాన నిందితుడు. ఈ కేసులో ఎనిమిది నెలల జైలు శిక్ష అనుభవించిన పాటిల్‌కు హైకోర్టు డిసెంబర్ 22న షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆ తరువాత ఆర్ డీ పాటిల్ చౌక్ థానే పోలీస్ స్టేషన్ లో జరుగుతున్న విచారణకు హాజరుకాలేదని సీఐడీ అధికారులు సమన్లు ​​జారీ చేశారు. నాలుగు సార్లు నోటీసులు జారీ చేసినా ఆర్ డీ పాటిల్ విచారణకు హాజరు కాలేదని ఆయన కోసం సీఐడీ అధికారులు అంటున్నారు. పాటిల్ విచారణకు హాజరుకాలేదంటే ఆయన బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఉందని ఓ సీనియర్ పోలీసు అధికారి అంటున్నారు.

English summary
CID officials issued notices to King Pin who is running away in SI jobs scam, but Patil sir no reaction in Karntka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X