ఎమ్మెల్సీ హోమో సెక్స్ కేసు, కోర్టుకు ఇలా సమాచారం ఇచ్చిన సీఐడీ అధికారులు
కర్ణాటక జేడీఎస్ పార్టీ ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసు ఆ రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ప్రస్తుతం సూరజ్ సీఐడీ కస్టడీలో ఉన్నాడు. ఈ కేసుకు సంబంధించి సీఐడీ కోర్టుకు తెలిపిన సమాచారం ఇలా ఉంది. నిందితుడు సూరజ్ ను సంఘటనా స్థలానికి పిలుచుకుని వెళ్లి పంచనామా చేయించాలని, అక్కడే అతని వాంగ్మూలం తీసుకోవాలని సిట్ అధికారులు కోర్టుకు చెప్పారు.
ఈ మేరకు నిందితుడు సూరజ్ ను పిలుచుకుని వెళ్లి అతని మొబైల్ ఫోన్ కనిపెట్టాలని, అక్కడి సీసీటీవీల పుటేజీలను సేకరించాలని సిట్ అధికారులు కోర్టుకు చెప్పారు. నిందితుడు సూరజ్ నివాసం ఉంటున్నది హాసన్ జిల్లా పరిధిలోకి వస్తుందని, అక్కడికి అతన్ని పిలుచుకుని వెళ్లడానికి అవకాశం ఇవ్వాలని సిట్ అధికారులు బెంగళూరులోని ప్రత్యేక కోర్టుకు మనవి చేశారు.

జేడీఎస్ ఎమ్మెల్సీ సూరజ్ ఉపయోగిస్తున్న వాహనాలను గుర్తించి వాటిని పరిశీలించాలని, నిందితుడు ధరించిన దుస్తులను పరీక్షించాలని, ఫిర్యాదుదారుని నిందితుడు ఎక్కడ బెదిరించాడు అని తెలుసుకోవడానికి సంఘటనా స్థలానికి వెళ్లి నిందితుడిని విచారణ చేసి అక్కడే పంచనామా నిర్వహించి సాక్ష్యాలు సేకరించి అతని నుండి వాంగ్మూలం తీసుకోవాలని సిట్ అధికారులు కోర్టుకు చెప్పారు,
నిందితుడు సూరజ్ చేసిన పని సమాజంలో తల దించుకునేలా ఉందని, కాబట్టి సూరజ్ రేవణ్ణను కస్టడీలోకి తీసుకోవాలని సీఐడీ అధికారులు కోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు సూరజ్ ను విచారణ చెయ్యడానికి సిట్ కు అనుమతి ఇచ్చింది. జేడీఎస్ ఎమ్మెల్సీ సూరజ్ ఓ మగాడిపై లైంగిక దాడి చెయ్యడానికి ప్రయత్నించాడని జేడీఎస్ ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ అరెస్టు కావడం కలకలం రేపుతోంది. ఇంతకు ముందే మహిళల మీద అత్యాచారం చేశాడని సూరజ్ సోదరుడు, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అరెస్టు అయ్యి జైల్లో ఉన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications