Cinema sketch: అర్దగంట, ఆరు మంది, రూ. 6 కోట్ల మొబైల్ ఫోన్లు లూటీ, ఆంధ్రా బార్డర్ లో అరాచకం !
బెంగళూరు: ధూమ్ సినిమా గుర్తుందా ?, అచ్చం ధూమ్ సినిమా స్కెచ్ టైపులో జాతీయ రహదారిలో దుండగులు ఆరు మంది అక్షరాలా ఆరు కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన మొబైల్ ఫోన్లు లూటీ చేశారు. ఆరు మంది నిందితులు అర్దగంటలో ఆరు కోట్ల రూపాయల విలువైన మొబైల్ ఫోన్లు లూటీ చెయ్యడం కలకలం రేపింది. ప్రసిద్ది చెందిన మొబైల్ కంపెనీకి చెందిన మొబైల్ ఫోన్లో దారి దోపిడీకి గురి కావడంతో సీనియర్ పోలీసు అధికారులు రంగంలోకి దిగారు. ఆంధ్రప్రదేశ్-కర్ణాటక సరిహద్దులో జరిగిన ఈ అరాచకం గురించి దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు దారి దోపీడికి జరిగిన ప్రాంతం నుంచి అటు వైపు కొన్ని కిలో మీటర్లు. ఇటు వైపు కొన్ని కిలోమీటర్ల పరిదిలో ఏర్పాటు చేసిన సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. రాత్రి పూర్తిగా నిర్జన ప్రదేశంలో బిక్కుబిక్కు మంటు గడిపిన కంటైనర్ డ్రైవర్ మరుసటి రోజు తప్పించుకోవడంతో దేవరాయ సముద్రం గేట్ లో జరిగిన ఈ అరాచకం వెలుగులోకి వచ్చింది.
Illegal
affair:
బలంగా
ఉన్న
భార్యకు
50
మంది
బాయ్
ఫ్రెండ్స్,
భర్తను
చంపేసి
ప్రియుడితో,
షాక్
!

కాంచీపురం టూ బెంగళూరు
తమిళనాడులోని
కాంచీపురంలో
తయారైన
ఎంఐ
కంపెనీ
మొబైల్
ఫోన్లు
బెంగళూరుకు
తీసుకెళ్లడానికి
సిద్దం
అయ్యారు.
కాంచీపురంలో
మద్యాహ్నం
3
గంటల
సమయంలో
శ్రీజి
ట్రాన్స్
పోర్టుకు
చెందిన
కంటైనర్
లో
రూ.
6
కోట్ల
39
లక్షల
విలువైన
మొబైల్
ఫోన్లు
లోడ్
చేసుకుని
బెంగళూరు
బయలుదేరారు.
కంటైనర్
డ్రైవర్
సురేష్
వాహనాన్ని
నడుపుకుంటూ
వచ్చాడు.

ఆంధ్రప్రదేశ్- కర్ణాటక బార్డర్ లో ?
కాంచీపురం
నుంచి
కంటైనర్
లారీ
తమిళనాడులోని
వేలూరు,
ఆంధ్రప్రదేశ్
లోని
చిత్తూరు
బైపాస్,
పలమనేరు
మీదుగా
ఆంధ్రప్రదేశ్-కర్ణాటక
పరిహద్దులోని
ముళబాగిలు
తాలుకా
దేవరాయ
సముద్రం
గేట్
సమీపంలోకి
వచ్చింది.
రాత్రి
కావడంతో
డ్రైవర్
సురేష్
కంటైనర్
ను
నిధానంగా
నడుపుకుంటూ
వచ్చాడని
సమాచారం.

ఆరు మంది అరాచకం
మొబైల్ ఫోన్లు లోడ్ చేసిన కంటేనర్ వాహనం దేవరాయ సముద్రం గేట్ సమీపంలో వెలుతున్న సమయంలో వెనుక నుంచి కారు ఓవర్ టేక్ చేసుకుంటూ కంటైనర్ వాహనాన్ని క్రాస్ చేసింది. కారులో నుంచి కిందకు దిగిన ఆరు మంది కంటైనర్ డ్రైవర్ సురేష్ తో గొడవ పెట్టుకున్నారు. కంటైనర్ డ్రైవర్ సురేష్ డ్రైవర్ సీటులో నుంచి కిందకు దిగి ఏం జరిగింది ? అంటూ కారులో వచ్చిన వారిని ప్రశ్నించాడు.

ధూమ్ సినిమా రిపీట్
ధూమ్ సినిమా టైపులో గొడవ చేసిన నిందితులు కంటైనర్ డ్రైవర్ ను పట్టుకుని చితకబాదేశారు. తరువాత కంటైనర్ డ్రైవర్ సురేష్ లాక్కొని జాతీయ రహదారికి దూరంగా నిర్జనప్రదేశంలోకి వెళ్లారు. డ్రైవర్ సురేష్ చేతులు, కాళ్లు కట్టేసి అతని నోట్లు బట్టలు కుక్కేశారు. డ్రైవర్ సురేష్ తప్పించుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్న నిందితులు మళ్లీ జాతీర రహదారి మీద నిలిపి ఉన్న కంటైనర్ వాహనం దగ్గరకు వెళ్లారు.

రూ. 6 కోట్ల మొబైల్ ఫోన్లు అర్దగంటలో మాయం
శ్రీజి ట్రాన్స్ పోర్టుకు చెందిన కంటేనర్ వాహనంలోని మొబైల్ ఫోన్లు మరో లారీలోకి ఎక్కించారు. అర్దగంటలో కంటేనర్ లో ఉన్న ఆరు కోట్ల రూపాయల విలువైన మొబైల్ ఫోన్లు వేరే వాహనంలోని షిఫ్ట్ చేసిన నిందితులు రెండు వాహనాలను నడుపుకుంటూ అక్కడి నుంచి జాగా ఖాళీ చేశారు. శ్రీజి ట్యాన్స్ పోర్టు కంటేనర్ వాహనాన్ని కోలారు తాలుకాలోని నర్నేహళ్ళి గ్రామం సమీపంలో వదిలేసి మొబైల్ ఫోన్లు నింపుకున్న మరో లారీతో పాటు కారులో నిందితులు దర్జాగా తప్పించుకుని పారిపోయారు.

తప్పించుకున్న డ్రైవర్
రాత్రి
మొత్తం
నిర్జనప్రదేశంలో
కాలం
గడిపిన
కంటైనర్
డ్రైవర్
మరుసటి
రోజు
ఉదయం
9.
30
గంటలకు
కట్లు
విడిపించుకుని
పరుగున
జాతీయ
రహదారి
మీదకు
చేరుకున్నాడు.
జాతీయ
రహదారి
మీద
ఉన్న
స్థానికుల
సహాయంతో
కంటేనర్
డ్రైవర్
సురేష్
ముళబాగిలు
తాలుకా
పోలీస్
స్టేషన్
చేరుకుని
జరిగిన
విషయం
మొత్తం
చెప్పాడు.

పక్కా ఫ్రీప్లాన్ తో లూటీ
రూ. 6 కోట్ల విలువైన మొబైల్ ఫోన్లు లూటీ చేశారని తెలుసుకున్న కోలారు ఎస్పీ కిశోర్ బాబు, వేలిముద్రల నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి ఆధారాలు సేకరించారు, పక్కా ఫ్రీప్లాన్ తో మొబైల్ ఫోన్లు లూటీ చేశారని, చాకచక్యంగా నిందితులు తప్పిచుకుని పారిపోయారని కోలారు జిల్లా పోలీసు అధికారులు అంటున్నారు.

కంపెనీ ఉద్యోగులు ఎవరైనా ?
ప్రసిద్ది చెందిన ఎంఐ కంపెనీ నుంచి రూ. 6 కోట్ల విలువైన మొబైల్ ఫోన్లు బెంగళూరుకు తీసుకు వెలుతున్నారని మ్యాటర్ లీక్ కావడం వలనే దారి దోపిడీ జరిగి ఉంటుందని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొబైల్ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగులు ఎవరైనా మొబైల్ ఫోన్లు లూటీ చేసిన వారికి సమాచారం ఇచ్చారా ? అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. కంటైనర్ డ్రైవర్ సురేష్ చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు.
Recommended Video

ఆంధ్రా-కర్ణాటక బార్డర్ లో హడల్
ఆంధ్రప్రదేశ్-కర్ణాటక సరిహద్దులో జరిగిన ఈ అరాచకం గురించి దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు దారి దోపీడికి జరిగిన ప్రాంతం నుంచి అటు వైపు కొన్ని కిలో మీటర్లు. ఇటు వైపు కొన్ని కిలోమీటర్ల పరిదిలో ఏర్పాటు చేసిన సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. రాత్రి పూర్తిగా నిర్జన ప్రదేశంలో బిక్కుబిక్కు మంటు గడిపిన కంటైనర్ డ్రైవర్ సురేష్ తప్పించుకోవడంతో దేవరాయ సముద్రం గేట్ లో జరిగిన ఈ అరాచకం వివరాలు వెలుగులోకి వచ్చాయి.