ఇట్స్ అఫీషియల్‌: పేరు మార్చుకున్న రష్మిక!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన పేరును మార్చుకున్నారు. గత కొన్నేళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రేమ పక్షుల్లా విహరించిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న... ఈ ఏడాది ఫిబ్రవరిలో అత్యంత వైభవంగా వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే.పెళ్లి తర్వాత సాధారణంగా హీరోయిన్లు తమ భర్త ఇంటిపేరు లేదా భర్త పేరుని తమ పేరుకు జోడించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే రష్మిక కూడా తన పేరు చివరన 'దేవరకొండ' లేదా 'విజయ్' అని యాడ్ చేస్తారని అభిమానులు భావించారు. కానీ పెళ్లయిన కొన్ని నెలల వరకు రష్మిక తన సోషల్ మీడియా అకౌంట్లన్నింటినీ పాత పేరుతోనే కొనసాగించడంతో ఆమె పేరు మార్చుకోరని అంతా భావించారు.

అత్తగారి ఊరిలో రష్మిక సర్‌ప్రైజ్
అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రష్మిక తాజాగా తన పేరు చివరన భర్త ఇంటిపేరును అధికారికంగా చేర్చారు. ఇటీవల ఆమె తన భర్త విజయ్ దేవరకొండతో కలిసి అత్తగారి సొంతూరైన నాగర్‌కర్నూల్ జిల్లా తుమ్మన్‌పేటకు వెళ్లారు. అక్కడ 'ది దేవరకొండ ఫౌండేషన్' ఆధ్వర్యంలో ఓ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. 2026 విద్యా సంవత్సరంలో 9.10వ తరగతుల్లో అత్యుత్తమ మార్కులు సాధించి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన స్థానిక విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందజేశారు. ఈ వేదికపై మాట్లాడుతున్న సమయంలో రష్మిక అందరికీ ఊహించని సర్‌ప్రైజ్ ఇస్తూ తనను తాను కొత్త పేరుతో పరిచయం చేసుకున్నారు.

Rashmika Mandanna Changes Her Name to Rashmika Mandanna Devarakonda Post Marriage with Vijay

"నేనే రష్మిక మందన్న దేవరకొండ"
సభను ఉద్దేశించి రష్మిక మందన్న మాట్లాడుతూ.. "ఈ రోజు రష్మిక మందన్న దేవరకొండలా మీ ముందు నిలబడి మాట్లాడుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది" అంటూ ఎమోషనల్ అయ్యారు. పెళ్లి తర్వాత రష్మిక బహిరంగంగా తన పేరును ఇలా మార్చుకుని పిలుచుకోవడం ఇదే తొలిసారి. అనంతరం ప్రతిభ చాటిన విద్యార్థులను అభినందిస్తూ.. "9, 10వ తరగతిలో ఫస్ట్‌, సెకండ్ ర్యాంకులు సాధించిన మీరు నా కంటే ముందే ఉన్నారు. చాలా కష్టపడి ఈ స్థానానికి వచ్చారు. జీవితంలో కొన్నిసార్లు గెలుస్తాం, కొన్నిసార్లు ఓడిపోతాం.. కానీ ప్రతి అనుభవం నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటాం. మీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మాటలు విని భవిష్యత్తులో గొప్పగా ఎదగాలి" అని విద్యార్థులకు రష్మిక దిశానిర్దేశం చేశారు.

సోషల్ మీడియాలో మార్పులుంటాయా?
రష్మిక మందన్న తన పేరును 'రష్మిక మందన్న దేవరకొండ'గా మార్చుకున్నట్లు స్వయంగా ప్రకటించడంతో దేవరకొండ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అటు అత్తగారి ఊరి ప్రజలు కూడా రష్మిక మాట్లాడిన తీరుకు ఫిదా అయిపోయారు. అయితే స్టేజ్ పైన తన పేరును మార్చుకున్నట్లు ప్రకటించిన రష్మిక.. తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్), ఫేస్‌బుక్ ఖాతాలలో కూడా ఈ కొత్త పేరును అప్‌డేట్ చేస్తారా? లేదా సోషల్ మీడియాలో పాత పేరునే ఉంచుతారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనిపై క్లారిటీ రావాలంటే రష్మిక తన అకౌంట్స్‌లో మార్పులు చేసే వరకు వేచి చూడాల్సిందే!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+