ఇన్ స్టా లైవ్‌లో సీక్రెట్ రివీల్ చేసిన విష్ణు ప్రియ..
యాంకర్ విష్ణు ప్రియ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవసరం లేదు. టెలివిజన్‌లో వరుస షోల ద్వారా ప్రేక్షకులను అలరించిన ఈ అమ్మడు.. ఆ తర్వాత బిగ్ బాస్ షో లోకి కూడా ఎంట్రీ ఇచ్చి మరింత చేరువైంది. ఈ అమ్మడుకి సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకుంది. గతంలో అందాలను ఆరబోస్తూ గ్లామర్ ఫోటోషూట్‌లతో నెట్టింట హీట్ పెంచింది. అయితే రీసెంట్ గానే ఇన్‌స్టాగ్రామ్ లో 'సబ్‌స్క్రిప్షన్స్' షురూ చేసింది.
కాగా విష్ణుప్రియపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఏఐఎస్‌ఎఫ్ నాయకులు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బుల కోసం కక్కుర్తి పడి యువతను తప్పుదోవ పట్టించేలా అర్ధనగ్న వీడియోలు పోస్ట్ చేస్తున్నారని, ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను వెంటనే బ్లాక్ చేయాలని వారు డిమాండ్ చేశారు. సెలబ్రిటీలుగా సమాజానికి ఆదర్శంగా ఉండాల్సింది పోయి, ఇలాంటి అశ్లీల ప్రచారాలు చేయడం సరికాదని వారు విమర్శించారు.

కానీ ఈ విషయం ఆమెకు పరోక్షంగా బాగా కలిసొచ్చిందని అంటున్నారు. AISF నాయకులు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేయకముందు సబ్‌స్క్రైబర్ల సంఖ్య పరిమితంగానే ఉండేది. అప్పుడు సబ్‌స్క్రైబర్ల సంఖ్య తక్కువ గానే ఉండగా.. ఆ తర్వాత బాగా పెరిగింది. ఇప్పుడు తన ఫాలోవర్స్ కోసం లైవ్ సెషన్ నిర్వహించింది ఈ భామ.
అయితే లేటెస్ట్ గా ఇచ్చిన లైవ్ లో.. పొట్టి బట్టల్లోనే అందాలను ఆరబోస్తూ ఎంట్రీ ఇచ్చిన ఈమె చెప్పిన ఓ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అందులో ఒకరు బాడీ కౌంట్ గురించి ప్రశ్నించగా.. నా బాడీ కౌంట్ 5 అంటూ ఓపెన్ అయ్యింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది.
#VishnuPriya Body Count : 5🙏🏻🙏🏻🙏🏻 https://t.co/cx58uFLIbl
— Swaasthi (@swaasthi_) June 15, 2026












Click it and Unblock the Notifications