కేసీఆర్ వంగి.., ప్రణబ్ ప్రశంస, డ్యాన్స్ చేశారు (పిక్చర్స్)
హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని, ప్రణాళికబద్ధమైన పట్టణీకరణతో సమస్యలు అధిగమించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు.
19వ శతాబ్దం నుంచి పట్టణీకరణ శరవేగంగా సాగుతోందని, 21వ శతాబ్దం పూర్తిగా నగరాలదేనన్నారు. హైదరాబాద్‌లో మూడు రోజులుగా జరుగుతోన్న ప్రపంచ మెట్రోపాలిస్ సదస్సు ముగింపు సమావేశాన్ని ఉద్దేశించి గురువారం ప్రణబ్ ప్రసంగించారు.
ప్రపంచవ్యాప్తంగా 50శాతం జనాభా నగరాల్లోనే నివసిస్తోందని, విద్యుత్, రవాణా సౌకర్యాలు, తాగునీరు వంటి సమస్యలను ప్రధానంగా ఎదుర్కొంటున్నారన్నారు.

మెట్రోపొలిస్
పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల కల్పన, కాలుష్యం నగరాలకు ప్రధానంగా సవాలుగా మారిందని, కాలుష్య నివారణకు హరిత వనాల పెంపు, కర్బనరహిత వస్తు వినియోగాన్ని ప్రోత్సహించాలని ప్రణబ్ సూచించారు.

మెట్రోపొలిస్
వచ్చే ఐదేళ్లలో స్వచ్ఛ భారత్‌గా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషి చేసి విజయవంతం చేయాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు.

మెట్రోపొలిస్
పట్టణాలు, నగరాలకు పెరుగుతున్న వలసల వల్ల ట్రాఫిక్ ప్రధాన సమస్యగా మారిందన్నారు. ప్రజా రవాణా వ్యవస్థలను మెరుగుపర్చుకోవాలన్నారు.

మెట్రోపొలిస్
హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థ ఇతర నగరాల కంటే భేష్‌గా ఉందని ప్రశంసించారు. దేశ జనాభాలో మూడవ వంతు జనాభా పట్టణాలు, నగరాల్లోనే నివసిస్తున్నారని, జిడిపిలో కూడా పట్టణాలు, నగరాల ఆదాయం 43 శాతం ఉందన్నారు.

మెట్రోపొలిస్
దేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 377 మిలియన్ 31 శాతం మంది పట్టణాల్లోనే నివసిస్తుందన్నారు. చైనాలో 45 శాతం, ఇండోనిషియాలో 54 శాతం, మెక్సికో 78 శాతం, బ్రిజిల్‌లో 87 శాతం జనాభా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారన్నారు.

మెట్రోపొలిస్
ప్రపంచవ్యాప్తంగా పట్టణ, నగరాలలో జనాభా పెరుగుదలకు సరిపడే విధంగా వౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసుకోవడానికి ప్రపంచంలో నగరాల మధ్య అవగాహన, పరస్పర సహకారం అవసరం ప్రణబ్ పేర్కొన్నారు.

మెట్రోపొలిస్
దేశంలోనే మొట్టమొదటి సారిగా మెట్రోపాలిస్ సదస్సు హైదరాబాద్‌లో జరిగిందని, కొత్త రాష్ట్రం అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం దీన్ని విజయవంతంగా నిర్వహించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించారు.

మెట్రోపొలిస్
పట్టణ, నగరాల సమస్యలపై దేశ, విదేశాల ప్రతినిధులు ఒక్కచోట చేరి చర్చించుకోవడం శుభ పరిణామమని ప్రణబ్ ముఖర్జీ అన్నారు.

మెట్రోపొలిస్
దేశంలో వంద నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ఇందుకోసం అర్బన్ డెవలప్‌మెంట్ మిషన్‌ను ఏర్పాటు చేస్తోందన్నారు.

మెట్రోపొలిస్
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రసంగిస్తూ.. పట్టణాలకు, నగరాలకు గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు రోజురోజుకు పెరిగిపోతున్నాయన్నారు.

మెట్రోపొలిస్
ఫలితంగా మురికివాడలు కూడా విస్తరించాయన్నారు. మురికివాడలు పెరుగకుండా శాటిలైట్ టౌన్స్‌ను ఏర్పాటు చేయబోతున్నామన్నారు.

మెట్రోపొలిస్
మొదటగా మురికివాడలు లేని హైదరాబాద్‌కు తీర్చిదిద్దడానికి లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. నగరాలలో జనాభా పెరగడం వల్ల భూమి లభ్యత తగ్గుతోందని, నగరాలను అభివృద్ధి చేయడం అనివార్యమైనప్పటికీ వారసత్వ కట్టడాలకు ముప్పు వాటిల్లకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

మెట్రోపొలిస్
ఇస్తాంబుల్ నగరంలో వారసత్వ కట్టడాలకు ముప్పువాటిల్లకుండా అభివృద్ధి చేసుకున్నారని, హైదరాబాద్‌లో కూడా అనేక వారసత్వ కట్టడాలు ఉన్నాయని ఇస్తాంబుల్‌ను మార్గదర్శకంగా తీసుకుంటామని కేసీఆర్ అన్నారు.

మెట్రోపొలిస్
మెట్రోపాలిస్ సదస్సులో చర్చించిన అంశాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తన స్వాగతోపన్యాసంలో వివరించగా, గవర్నర్ నరసింహన్, మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కె జోషి, హైదరాబాద్ మేయర్ మాజీద్ హుస్సెన్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.

మెట్రోపొలిస్
మహానగరాలు, పట్టణాలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే ఆయా ప్రాంతాల ఆర్థిక, సామాజిక, భౌగోళిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని, సుపరిపాలన సాగించినపుడే అభివృద్ధి సాధ్యమవుతుందని వక్తలు పేర్కొన్నారు.

మెట్రోపొలిస్
మెట్రోపాలిస్ అంతర్జాతీయ సదస్సులో గురువారం కూడా పలు అంశాలపై చర్చలు జరిగాయి. తొలుత పట్టణాల్లో సుపరిపాలన అంశంపై జరిగిన కార్యక్రమంలో వక్తలు, నిపుణులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

మెట్రోపొలిస్
డైరెక్టర్ జనరల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెస్ కె. రామకృష్ణారావు మాట్లాడుతూ స్వపరిపాలన నాలుగు ప్రధాన పిల్లర్లపై కొనసాగుతుందని, అవి పరిపాలన, స్వరూపం, ప్రక్రియ, టెక్నాలజీ, ప్రజలు అని అభివర్ణించారు.

మెట్రోపొలిస్
అనంతరం హాల్ 2లో ఆర్థిక ప్రాదేశిక అభివృద్ధి అంశంపై వక్తలు ప్రసంగించారు. ఆర్థికంగా పట్టణాలు, మహానగరాలు ఎలా నిలదొక్కుకోవాలి? ఆర్థిక వనరులను ఎలా సమీకరించుకోవాలన్న విషయంపై వక్తలు ప్రసంగించారు.

మెట్రోపొలిస్
అనంతరం నగర నిర్వహణ బాధ్యతల్లో భాగంగా వౌలిక వసతులు, రోడ్లు, నిర్వహణ అంశంపై బల్దియా కమిషనర్ సోమేశ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సదస్సులో పలువురు నిపుణులు ప్రసంగించారు.

మెట్రోపొలిస్
సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర జనాభాలో సుమారు 40శాతం మంది పట్టణాల్లో నివసిస్తున్నారన్నారు. నగరాన్ని స్లమ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన ప్రతిపాదనలు, ఇప్పటికే అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను ఆయన వివరించారు.

మెట్రోపొలిస్
ప్రస్తుతమున్న భౌగోళిక, పర్యావరణ పరిస్థితులను విశే్లషిస్తూ, పట్టణాల్లో కాంక్రీట్ జంగిల్‌ను వీలైనంత వరకు తగ్గించుకునేందుకు ప్రయత్న జరగాలన్న అభిప్రాయాలు వ్యక్తమవయ్యాయి.

మెట్రోపొలిస్
వీటితో పాటు పట్టణాల్లోని పేదరిక నిర్మూలన, చిరువ్యాపారుల జీవనోపాధి వంటి అంశంపై వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు మాట్లాడారు.

మెట్రోపొలిస్
కాగా, దేశ విదేశాలకు చెందిన సుమారు 1600 మంది ప్రతినిధులతో మహానగరంలోని హెచ్‌ఐసిసి వేదికగా ఈ నెల 6 నుంచి జరుగుతున్న మెట్రోపొలిస్ వరల్డ్ కాంగ్రెస్‌కు శుక్రవారంతో ముగియనుంది.

మెట్రోపొలిస్
అధికారికంగా గురువారం మధ్యాహ్నామే రాష్ట్రపతిచే ముగింపు సభ జరిగినా, శుక్రవారం గ్లోబల్ సిటీల్లో రాజకీయ వాతావరణ మార్పులు అంశంపై సదస్సును నిర్వహించినానంతరం ప్రతినిధులు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పలు అంశాలు, అరుదైన ప్రాజెక్టులకు సంబంధించి తొమ్మిది సాంకేతిక సందర్శనలు నిర్వహించనున్నారు.

మెట్రోపొలిస్
ఇందులో భాగంగా ప్రతినిధులు వివిధ బృందాలుగా ఉదయం పదకొండున్నర గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు హైదరాబాద్ మెట్రో రైలు, మహిళల స్వయం సహాయక బృందాలు, ఐటి కారిడార్, సైబరాబాద్, హెరిటెజ్ కన్జర్వేషన్, ఫలక్‌నుమా హోటల్, ఔటర్ రింగురోడ్డు, జైకా నిధులతో హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్, అత్యవసర సేవలు, బల్దియా అమలు చేస్తున్న రూ. 5కే సబ్సిడీ ఆహార పథకాలపై ఈ సందర్శనలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

రాష్ట్రపతికి కేసీఆర్ స్వాగతం
మెట్రో పొలిస్ సదస్సులో ప్రసంగించేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హెచ్‌ఐసిసికి వచ్చారు. ప్రణబ్ పర్యటన సందర్భంగా పోలీసులు కొంత ఉత్సాహాన్ని ప్రదర్శించారు.

రాష్ట్రపతికి విమానాశ్రయంలో స్వాగతం
రోడ్లన్నీ శుభ్రంగా ఉన్నప్పటికీ పోలీసులు ట్రాఫిక్‌ను నిలిపివేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. వాస్తవానికి రాష్ట్రపతి హెలికాఫ్టర్ న్యాక్‌లో ల్యాండ్ కావలసి ఉన్నప్పటికీ హైటెన్స్ వైర్లు అడ్డువస్తున్నాయని హెలీప్యాడ్‌ని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్‌కు మార్చారు.

రాష్ట్రపతికి విమానాశ్రయంలో స్వాగతం
ప్రణబ్ ముఖర్జీ గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావులు హెలికాప్టర్‌లో 2.55 నిమిషాలకు పరేడ్ గ్రౌండ్‌లో దిగారు.

రాష్ట్రపతికి విమానాశ్రయంలో స్వాగతం
అక్కడి వీరు రోడ్డు మార్గంలో రహేజా ఐటి పార్కు హైటెక్ సిటీ మెటల్ చార్మినార్ మీదుగా మెట్రోపొలిస్ సదస్సు జరుగుతున్న హెచ్‌ఎంసిసికి చేరుకున్నారు.

రాష్ట్రపతికి కేసీఆర్ స్వాగతం
సాయంత్రం 4-20కు హెచ్‌ఐసిసి నుండి బయలుదేరిన వీరు ముగ్గురు సైబరాబాద్ కమిషనరేట్‌కు 4.35కు చేరుకుని 4-40కు అదే హెలికాప్టర్‌లో బేగంపేటకు వెళ్లిపోయారు.

రాష్ట్రపతికి కేసీఆర్ స్వాగతం
రాష్ట్రపతి వచ్చిన హెలికాప్టర్‌లో బేగంపేటకు వెళ్లిపోయారు. అయితే, పోలీసులు 20 నిమిషాల ముందే ట్రాఫిక్ నిలిపివేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.

రాష్ట్రపతికి గవర్నర్ స్వాగతం
మధ్యాహ్నం ఒంటి గంట నుండే రోడ్లపై ట్రాఫిక్‌ను ఆపివేశారు. రహేజా ఐటి పార్కువద్ద గంటముందే వెళ్లగొట్టారు. మామూలు సమయాల్లో సాయంత్రం 3-5 గంటలమధ్యి ట్రాఫిక్ రద్దీగా ఉండే ఆ పరిసరాలు నేడు అదే సమయంలో వెలవెలబోయాయి.

రాష్ట్రపతి
హైదరాబాదులో జరుగుతున్న మెట్రోపొలిస్ వరల్డ్ కాంగ్రెస్ సదస్సులో పాల్గొనేందుకు గురువారం హైదరాబాదుకు వచ్చిన రాష్ట్రపతికి బేగంపేటలో స్వాగతం...

రాష్ట్రపతి
హైదరాబాదులో జరుగుతున్న మెట్రోపొలిస్ వరల్డ్ కాంగ్రెస్ సదస్సులో పాల్గొనేందుకు గురువారం హైదరాబాదుకు వచ్చిన రాష్ట్రపతికి బేగంపేటలో స్వాగతం...

రాష్ట్రపతి
హైదరాబాదులో జరుగుతున్న మెట్రోపొలిస్ వరల్డ్ కాంగ్రెస్ సదస్సులో పాల్గొనేందుకు గురువారం హైదరాబాదుకు వచ్చిన రాష్ట్రపతికి బేగంపేటలో స్వాగతం...

మెట్రోపొలిస్
హైదరాబాదులో జరుగుతున్న మెట్రోపొలిస్ వరల్డ్ కాంగ్రెస్ సదస్సు శుక్రవారం ముగియనుంది. కాగా, గురువారం జలవిహార్‌లో ప్రతినిధులు డిన్నర్ చేశారు.

మెట్రోపొలిస్
హైదరాబాదులో జరుగుతున్న మెట్రోపొలిస్ వరల్డ్ కాంగ్రెస్ సదస్సు శుక్రవారం ముగియనుంది. కాగా, గురువారం జలవిహార్‌లో ప్రతినిధులు డిన్నర్ చేశారు. గిరిజనులతో కలిసి నృత్యాలు చేశారు.

మెట్రోపొలిస్
హైదరాబాదులో జరుగుతున్న మెట్రోపొలిస్ వరల్డ్ కాంగ్రెస్ సదస్సు శుక్రవారం ముగియనుంది. కాగా, గురువారం జలవిహార్‌లో ప్రతినిధులు డిన్నర్ చేశారు. గిరిజనులతో కలిసి నృత్యాలు చేశారు.

మెట్రోపొలిస్
హైదరాబాదులో జరుగుతున్న మెట్రోపొలిస్ వరల్డ్ కాంగ్రెస్ సదస్సు శుక్రవారం ముగియనుంది. కాగా, గురువారం జలవిహార్‌లో ప్రతినిధులు డిన్నర్ చేశారు. గిరిజనులతో కలిసి నృత్యాలు చేశారు.

మెట్రోపొలిస్
హైదరాబాదులో జరుగుతున్న మెట్రోపొలిస్ వరల్డ్ కాంగ్రెస్ సదస్సు శుక్రవారం ముగియనుంది. కాగా, గురువారం జలవిహార్‌లో ప్రతినిధులు డిన్నర్ చేశారు. గిరిజనులతో కలిసి నృత్యాలు చేశారు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications