సీజే, సుప్రీం జడ్జిలు 20 నిమిషాల పాటు భేటీ: పద్మావత్ సతీసహగమనంపై తీర్పు

న్యూఢిల్లీ: పద్మావత్ సినిమా వివాదాల్లో చిక్కుకొని జనవరి 24వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలోని ఆఖరి సన్నివేశంలో సతీసహాగమన దృశ్యాలను చూపించారని, ఆ సీన్ తొలగించాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది.

పిటిషన్‌లో పేర్కొన్న సహగమన అంశాలపై సీజే దీపక్ మిశ్రా స్పందిస్తూ.. సినిమాలోని సతీ సహగమనం సీన్ చూసి మహిళలు ఇలాంటి అఘాయిత్యాలు చేసుకుంటారని మీకు అనిపిస్తోందా, ఇన్నేళ్లలో మహిళా సాధికారత పెరుగుతూ వచ్చిందని చెబుతూ పిటిషన్‌ను తిరస్కరించారు.

CJ, SC judges in 20 minute huddle post Venkaiah Naidus rejection of notice to remove Dipak Misra

కాగా, అంతకుముందు, శుక్రవారం జస్టిస్ దీపక్ మిశ్రా పైన ప్రతిపక్ష పార్టీలు అభిశంసం నోటీసు ఇచ్చాయి. న్యాయనిపుణులతో చర్చించిన అనంతరం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ నోటీసును తిరస్కరించారు. ఉపరాష్ట్రపతి నోటీసు తిరస్కరించిన తర్వాత దీపక్ మిశ్రా ఈ పిటిషన్ పైన తీర్పు ఇచ్చారు.

20 నిమిషాల పాటు భేటీ

సుప్రీం కోర్టులో రోజువారీగా చూస్తే విచారణ కార్యకలాపాలు సోమవారం పదిహేను నిమిషాలు ఆలస్యంగా మొదలయ్యాయి. సీజే, ఇతర న్యాయమూర్తులు 20 నిమిషాల పాటు సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ప్రతి రోజు సుప్రీం కోర్టు న్యాయమూర్తులతో సీజే సమావేశం కావడం సాధారణం. కానీ ఐదు నిమిషాల పాటు ఉంటుంది. కానీ సోమవారం 20 నిమిషాల పాటు భేటీ జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+