తన ఇద్దరు వికలాంగ కూతుళ్లను సుప్రీంకోర్టుకు పిలిపించిన సీజేఐ..!!
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్.. ఇవ్వాళ తన ఇద్దరు పెంపుడు కూతుళ్లకు న్యాయస్థానానికి పిలిపించారు. వారి కోరిక మేరకు సుప్రీంకోర్టు పనితీరు, కార్యకలాపాలను దగ్గరుండి చూపించారు. ఈ ఉదయం ఆయన తన ఇద్దరు పెంపుడు కూతుళ్లతో కలిసి సుప్రీంకోర్టుకు చేరుకున్నారు. తొలుత తన ఛాంబర్ లోకి తీసుకెళ్లారు. కొద్దిసేపు మాట్లాడారు. సుప్రీంకోర్టు ఉద్యోగులు వారిని సాదారంగా ఆహ్వానించారు.
సీజేఐ డీవై చంద్రచూడ్ కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య రష్మీ 2007లో మరణించారు. చంద్రచూడ్-రష్మీ దంపతులకు ఇద్దరు కుమారులు అభినవ్, చింతన్ ఉన్నారు. ఇద్దరూ న్యాయవాద వృత్తిలోనే స్థిరపడ్డారు. బొంబే హైకోర్ట్ లో అభినవ్ న్యాయవాదిగా పని చేస్తోన్నారు. లండన్ లోని బ్రిక్ కోర్ట్ ఆఫ్ ఛాంబర్స్ అనే లా సంస్థలో ఉద్యోగి.

రష్మీ మరణం తరువాత కల్పనా దాస్ ను రెండో వివాహం చేసుకున్నారాయన. ఇద్దరు ఆడపిల్లలను పెంచుకుంటోన్నారు. పెద్ద కుమార్తె పేరు ప్రియాంక. 20 సంవత్సరాలు. చిన్న కూతురి పేరు మహీ. 16 సంవత్సరాలు. ఇద్దరూ వికలాంగులే. వీల్ ఛైర్లకే పరిమితం అయ్యారు. వారిద్దరి కోరిక మేరకు సుప్రీంకోర్టు కార్యకలాపాలు ఎలా ఉంటాయనే విషయాన్ని ఆయన ప్రత్యక్షం చూపించారు. కోర్టు విధి విధానాల గురించి వారికి వివరించారు.
ఈ ఉదయం 10 గంటలకు ప్రియాంక, మహీతో కలిసి కోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్. పబ్లిక్ గ్యాలరీ నుంచి వికలాంగులైన తన కుమార్తెలతో సహా కోర్టు గదిలోకి ప్రవేశించారు. నేరుగా తన ఛాంబర్ కు తీసుకెళ్లారు. అక్కడున్న వసతుల గురించి వివరించారు. అనంతరం వారిని వెంటబెట్టుకుని ప్రధాన కోర్ట్ రూమ్ కు తీసుకెళ్లారు. అక్కడి కార్యకలాపాల గురించి తెలియజేశారు. అన్ని కోర్ట్ రూమ్ లను సందర్శించారు. సీనియర్ న్యాయమూర్తులు, న్యాయవాదులకు పరిచయం చేశారు.
న్యాయమూర్తులు ఎక్కడ కూర్చుంటారు?, న్యాయవాదులు ఎలా వాదిస్తారు? వారు ఉండే చోటు.. ఇవన్నీ దగ్గరుండి చూపించారు సీజేఐ డీవై చంద్రచూడ్. ఈ మధ్యకాలంలో పిటీషన్ల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేస్తోన్నట్లు తెలిపారు. ప్రత్యక్ష ప్రసారం ఎలా చేస్తారనేది వివరించారు.












Click it and Unblock the Notifications