ఢిల్లీ స్కూల్ టాయిలెట్లో విద్యార్థి మృతి: హత్యనా?

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. ఢిల్లీలోని కారవాల్ నగర్ ప్రాంతంలోని ఓ పాఠశాలలోని టాయిలెట్లో స్పృహ తప్పి పడిపోయిన విద్యార్థి మరణించాడు. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మరణించాడు.

మృతుడు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. తుషార్ కుమార్ అన ఆ 16 ఏళ్ల విద్యార్థి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కొంత మంది విద్యార్థులు వాష్‌రూంలో తమ కుమారుడిని కొట్టి పడేసిపోయారని అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

నిరుడు సెప్టెంబర్‌లో గుర్గావ్‌లోని రియాన్ ఇంటర్నేషనల్ స్కూల్ వాష్‌రూంలో రెండో తరగతి విద్యార్థి ప్రద్యుమ్నను ఓ సీనియర్ విద్యార్థి హత్య చేసిన సంఘటనను ఇది తలపిస్తోందని అంటున్నారు.

Class 9 Student Found Dead In Delhi School Toilet, Parents Allege Murder

అయితే, తుషార్ శరీరంపై ఏ విధమైన గాయాలు లేవని పోలీసులు అంటున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మృతికి కారణాలు తెలుస్తాయని చెబుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తుషార్ క్లాస్‌మేట్స్‌ను, తుషార్‌ను వాష్‌రూంలో చూసిన విద్యార్థులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

తుషార్ ఇల్లు పాఠశాల ఉన్న కారవాల్ నగర్ ప్రాంతంలోని ఉంది. మృతుడి కుటుంబ సభ్యులు, స్థానికులు రోడ్డు మీదికి వచ్చి సంఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+