పాట్నా ఎయిమ్స్‌లో పిల్లలపై భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకా ట్రయల్స్ ప్రారంభం

పాట్నా: హైదరాబాద్ నగరానికి చెందిన ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకా పిల్లలపై ట్రయల్స్ ప్రక్రియ ప్రారంభమైంది. బీహార్ రాజధాని పాట్నాలోని ఎయిమ్స్‌లో కోవాగ్జిన్ కరోనా టీకా ట్రయల్స్ పిల్లలపై ప్రారంభించినట్లు సంస్థ వెల్లడించింది. టీకా వేసేందుకు 15 మంది పిల్లలను ట్రయల్స్ కోసం ఎంపిక చేయగా, అన్ని పరీక్షల అనంతరం ముగ్గురికి వ్యాక్సిన్ వేశారు.

Recommended Video

    Covaxin Clinical Trials On Children Begins చిన్నారులపై 3rd Wave తీవ్ర ప్రభావం || Oneindia Telugu

    సుమారు 100 మంది పిల్లలపై ట్రయల్స్ నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పాట్నా ఎయిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ సీఎం సింగ్ తెలిపారు. వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఇప్పటి వరకు 108 మంది పేర్లు నమోదు చేసుకున్నారని, స్క్రీనింగ్ అనంతరమే వ్యాక్సిన్ వేస్తామని తెలిపారు. ట్రయల్స్‌లో ఇంట్రామాస్కులర్ విధానంలో 0.5 ఎంఎల్ మోతాదు ఇచ్చామని, అనంతరం వారిని రెండు గంటలు అబ్జర్వేషన్లో ఉంచామని చెప్పారు.

    Clinical trials of Bharat Biotechs Covaxin on children begins at AIIMS, Patna

    2-18 ఏళ్ల వయస్సున్న పిల్లల్లో రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) నుంచి భారత్ బయోటెక్ కోవాగ్జిన్‌కు ఆమోదం లభించిన విషయం తెలిసిందే. పిల్లలపై ట్రయల్స్.. పాట్నా, ఢిల్లలోని ఎయిమ్స్ తోపాటు నాగ్‌పూర్‌లోని మెడిట్రినా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో జరుగుతున్నాయి. కాగా, మొత్తం 525 మంది వాలంటీర్లపై ఈ ట్రయల్స్ నిర్వహించాలని నిర్ణయించినట్లు భారత్ బయోటెక్ తెలిపింది. 28 రోజుల వ్యవధిలో రెండు డోసుల డీకాలను ఇచ్చి పరిస్థితిని పరిశీలించనున్నారు.

    కోవాగ్జిన్ టీకాను భారత్ బయోటెక్.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సహాయంతో అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. కాగా, కరోనా థర్డ్ వేవ్‌లో చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతుందని పలువురు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో భారత్ బయోటెకో ఈ ట్రయల్స్ ను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో కోవాగ్జిన్ తోపాటు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను 18ఏళ్లు పైబడినవారందరికీ ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, రష్యాకు చెందిన స్పుత్నిక్ వీని కూడా అందిస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+