వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

CM chair: సీఎం కుర్చీలో సీఎం కొడుకు కుర్చుని ఏం చేశాడంటే ?, క్లారిటీ, వైరల్ !

|
Google Oneindia TeluguNews

ముంబాయి/థాణే: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, ఆయన కుమారుడు, ఎంపీ వివాదంలో చిక్కుకున్నారు. మహారాష్ట్రలోని ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడంలో కీలకపాత్ర వహించిన ఏక్ నాథ్ షిండే తరువాత ఆయనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోయారు. ఏక్ నాథ్ షిండే సీఎం కాకముందే ఆయన కుమారుడు శ్రీకాంత్ షిండే శివసేన పార్టీ సింబల్ మీద ఎంపీగా గెలిచారు. ఇప్పుడు సీఎం ఏక్ నాథ్ షిండే కోసం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కుర్చీలో ఆయన కుమారుడు శ్రీకాంత్ షిండే కుర్చుని అధికారులతో మాట్లాడుతూ ఫైల్స్ తిరగేస్తున్న సమయంలో తీసిన కొన్ని ఫోటోలు, వీడియోలు బయటకు రావడంతో వైరల్ అయ్యింది. ప్రతిపక్ష పార్టీల నాయకులు ఈ ఫోటోలు, వీడియో లీక్ చెయ్యడంతో హాట్ టాపిక్ అయ్యింది.

Khiladi lady: ఆరు మంది భర్తలు, 7 పెళ్లికి రెఢీ,పెళ్లికొడుకు తాళి కట్టేటైమ్ లో ఆరో భర్త ఎంట్రీ,కన్నింగ్ స్కెచ్!Khiladi lady: ఆరు మంది భర్తలు, 7 పెళ్లికి రెఢీ,పెళ్లికొడుకు తాళి కట్టేటైమ్ లో ఆరో భర్త ఎంట్రీ,కన్నింగ్ స్కెచ్!

 ఉద్దవ్ ఠాక్రేని ఇంటికి పంపించిన ఏక్ నాథ్ షిండే

ఉద్దవ్ ఠాక్రేని ఇంటికి పంపించిన ఏక్ నాథ్ షిండే

మహారాష్ట్రలోని ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడంలో కీలకపాత్ర వహించిన ఏక్ నాథ్ షిండే తరువాత ఆయనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోయారు. బీజేపీతో కలిసి ఏక్ నాథ్ షిండే మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఏక్ నాథ్ షిండే సీఎం కాకముందే ఆయన కుమారుడు శ్రీకాంత్ షిండే శివసేన పార్టీ సింబల్ మీద ఎంపీగా గెలిచారు.

 సీఎం కుర్చీలో సీఎం కొడుకు

సీఎం కుర్చీలో సీఎం కొడుకు

ఏక్ నాథ్ షిండే కోసం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కుర్చీలో ఆయన కుమారుడు శ్రీకాంత్ షిండే కుర్చుని అధికారులతో మాట్లాడుతూ ఫైల్స్ తిరగేస్తున్న సమయంలో తీసిన కొన్ని ఫోటోలు, వీడియోలు బయటకు రావడంతో వైరల్ అయ్యింది. తండ్రి సొంతపనులు చేసుకుంటుంటే ఆయన కొడుకు ,ఎంపీ శ్రీకాంత్ షిండే అధికారుల మీద పెత్తనం చెలాయిస్తున్నారని ప్రతపక్షాలె మండిపడుతున్నారు.

 సీఎం ఆఫీసు కానేకాదు

సీఎం ఆఫీసు కానేకాదు

ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే కుమారుడు, శివసేన రెబ్ ఎంపీ స్పందించారు. సీఎం ఏక్ నాథ్ షఇండేకి కేటాయించిన సీట్లో తాను కుర్చేదని పోలీసులు అంటున్నారు. తన తండ్రి ఏక్ నాథ్ షిండే కోసం ప్రభుత్వ కార్యాలయాలు, ముంబాయిలోని ఆయన అధికార నివాసంలో ఏర్పాటు చేసిన సీఎం కుర్చీలో తాను ఎప్పుడు ఎక్కడా కుర్చోలేదని శివసేన రెబల్ ఎంపీ శ్రీకాంత్ షిండే స్పష్టం చేశారు.

 ఆ కుర్చీ సీఎం కోసం ఎక్కడ వేశారంటే ?

ఆ కుర్చీ సీఎం కోసం ఎక్కడ వేశారంటే ?

థానేలోని మా ఇంటిలో తన తండ్రి ఏక్ నాథ్ షిండే కోసం ఏర్పాటు చేసిన కుర్చీలో తాను కుర్చుని ప్రజలు సమస్యలు అడిగి తెలుసుకున్నానని సీఎం కొడుకు శ్రీకాంత్ షిండే వివరణ ఇచ్చాడు. ఇప్పటి వరకు సీఎం ఏక్ నాథ్ షిండే కోసం ఏర్పాటు చేసిన చాంబర్స్ లో, ఆయనకోసం ఏర్పాటు చేసిన కుర్చీల్లో తాను ఇంతవరకు ఎక్కడా కుర్చోలేదని శ్రీకాంత్ షిండే వివర ఇచ్చారు. అయితే ఎన్ సీపీ నేత రవికాంత్ వార్పే, శివసేన ఎంపీ (ఉద్దవ్ ఠాక్రే వర్గం) ప్రియాంక చతుర్వేది ఏక్ నాథ్ షిండే, ఆయన కుమారుడు శ్రీకాంత్ తీరుతో తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

English summary
CM chair: A photo of MP Srikanth Shinde sitting on Maharashtra Chief Minister Eknath Shinde's chair has gone viral.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X