వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంజాబ్ ఎన్నికలను ఆపండి.. ఈసీకి కాంగ్రెస్, బీజేపీ లేఖ.. లేదంటే 20 లక్షల మంది..

|
Google Oneindia TeluguNews

పంజాబ్ ఎన్నికల వాయిదాకు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ పట్టుబడుతున్నాయి. ఈమేరకు కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీలు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశాయి. గురురవిదాస్ జయంతి ఉత్సవాలు ఫిబ్ర‌వ‌రి 16న బెనారస్‌లో ఘనంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు దాదాపు 20 లక్షల మంది వెళ్లే అవకాశం ఉంది. దీంతో వీరంతా పంజాబ్ ఎన్నికల్లో తమ ఓటును వినియోగించుకోనే అవకాశం లేకుండా పోతుంది. పోలింగ్ శాతం భారీగా తగ్గే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈసీకి ప్రధాన పార్టీలు ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నాయి..

 ఎన్నికలను వారం పాటు వాయిదా వేయండి..

ఎన్నికలను వారం పాటు వాయిదా వేయండి..

పంజాబ్ ఎన్నికలను ఒక వారం పాటు వాయిదా వేయాలని ఆరాష్ట్ర సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఉత్తరప్రదేశ్‌లోని బెనారస్‌లో ఫిబ్రవరి 10 నుంచి 16 వరకు గురురవిదాస్ జయంతి ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు పంజాబ్ రాష్ట్రం నుంచే దాదాపు 20 లక్షలమందికి పైగా వెళ్లే అవకాశం ఉందని చన్నీ తెలిపారు. కానీ షెడ్యూల్ ప్రకారం పంజాబ్ ఎన్నికలు ఫిబ్రవరి 14న ఒకే దశలో జరగనున్నాయి. దీంతో ఆ 20 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోనియోగించుకునే అవకాశం లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలను వారం రోజుల పాటు వాయిదా వేయాలని ఈసీని పంజాబ్ సీఎం లేఖలో కోరారు.

 బెనారస్ 20 లక్షల మంది

బెనారస్ 20 లక్షల మంది

గురురవిదాస్ జయంతి వేడుకలు ఉన్న నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలని దళిత వర్గాలు సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీని కోరాయి. పంజాబ్‌లో ఆ వర్గానికి చెందిన వారు దాదాపు 32 శాతం మంది ఉన్నారు. 20 లక్షలకు పైగా వీరంతా బెనారస్ వెళ్తే పోలింగ్ శాతం కూడా భారీగానే తగ్గిపోతుంది. విజయావకాశాలు కూడా తారుమారు అవుతాయి. ఈనేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలు వాయిదా వేయాలని ఈసీని కోరుతున్నాయి.

ఫిబ్రవరి 16న గురురవిదాస్ జయంతి

ఫిబ్రవరి 16న గురురవిదాస్ జయంతి

బీజేపీ, బీఎస్పీ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖలు రాశాయి. ఎన్నికలను రీ షెడ్యూల్ చేయాలని డిమాండ్ చేశాయి. గురురవిదాస్ జయంతి ఫిబ్రవరి 16న జర‌గ‌నుంది. అనంతరం ఫిబ్రవరి 20న ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాష్ కూడా పంజాబ్ ఎన్నికలను ఫిబ్రవరి 18 తర్వాత నిర్వహించాలని ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాశారు.

 ఈసీ నిర్ణ‌యం ఏలా ఉండ‌బోతుంది..?

ఈసీ నిర్ణ‌యం ఏలా ఉండ‌బోతుంది..?


పంజాబ్‌లో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిన్నింటికి ఫిబ్రవరి 14న ఒకే దశలో ఎన్నికలు నిర్వహించాలి ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసింది. మార్చి 10న ఫలితాలను వెల్లువడతాయి. ఇప్పుడు ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వాయిదా కోరుతున్నాయి. దీనిపై ఈసీ ఎలాంటి నిర్ణయిం తీసుకుంటుందో చూడాలి మరి..

English summary
Congress, bjp, bjp asked Election Commission to postpone Punjab Polls
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X