ఆరెస్సెస్ కోటలో కాంగ్రెస్ గెలుపు-ట్వీట్ డిలీట్ చేసుకున్న సీఎం..!

దేశంలోని నాలుగు అతిపెద్ద రాష్ట్రాల్లో నిన్న వెలువడిన 28 ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద షాకియ్యాయి. ఓవైపు జాతీయ స్దాయిలో సీఈసీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తూ, కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ పై ఒత్తిడి పెంచుతున్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఫలితాలు అశనిపాతంగా పరిణమించేలా కనిపించాయి. దీంతో కౌంటింగ్ పూర్తి కాకముందే ప్రధాని మోడీ.. బ్యాలెట్ పేపర్ తో నిర్వహించిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెల్చుకుంటుందో తెలుసా అంటూ సెటైరికల్ ట్వీట్ వేశారు. అంతే .. బీజేపీ నేతలు, ముఖ్యమంత్రులు, మంత్రులు, కేంద్రమంత్రులు ఇలా ప్రతీ ఒక్కరూ దాన్ని రీట్వీట్ చేస్తూ తమదైన శైలిలో సెటైర్లు మొదలుపెట్టేశారు.

మోడీ చాణక్యం..! ఓ మంత్రి రాజీనామాతో ఖాళీ అయిన బెర్తు మరో కేంద్రమంత్రికి..!
మోడీ చాణక్యం..! ఓ మంత్రి రాజీనామాతో ఖాళీ అయిన బెర్తు మరో కేంద్రమంత్రికి..!

ఇదే క్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) సైతం తాను సైతం అన్నట్లుగా స్పందించారు. ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీకి 28 ఎమ్మెల్సీ స్ధానాల్లో దక్కింది జీరో అంటూ చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ.. బిగ్ ఫ్యాట్ జీరో అంటూ మరింత మసాలా జోడించారు. దీంతో కాంగ్రెస్ ఘోర పరాజయానికి సీఎం ఫడ్నవీస్ స్పందన సరిగ్గానే ఉందని బీజేపీ కార్యకర్తలు సంతోషించే లోపే ఓ షాక్ తగిలింది. మహారాష్ట్రలోని నాగ్ పూర్ డివిజన్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటును కాంగ్రెస్ పార్టీ గెల్చుకుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్నాటక సహా మూడు రాష్ట్రాల్లో ఖాతా తెరవని కాంగ్రెస్.. మహారాష్ట్రలో మాత్రం ఖాతా తెరిచి సత్తా చాటుకుంది.

Devendra Fadnavis Deletes Big Fat Zero Post After Congress Wins Nagpur MLC Seat
మోడీ కంచుకోట బద్దలు-వారణాసిలో సమాజ్ వాదీ పార్టీ బిగ్ షాక్..!
మోడీ కంచుకోట బద్దలు-వారణాసిలో సమాజ్ వాదీ పార్టీ బిగ్ షాక్..!

నాగపూర్ డివిజన్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్ధానంలో కాంగ్రెస్ అభ్యర్ధి అభిజీత్ వంజారీ.. బీజేపీ అభ్యర్ధి సుధాకర్ కొహాలేపై 3271 ఓట్ల తేడాతో విజయం సాధించారు. దీంతో చేసేది లేక సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ .. బిగ్ ఫ్యాట్ జీరో అంటూ కాంగ్రెస్ ను ఉద్దేశించి చేసిన ట్వీట్ ను డిలీట్ చేసుకోవాల్సి వచ్చింది. ఇదే అదనుగా కాంగ్రెస్ పార్టీ ఆయనతో పాటు బీజేపీపై ఎదురుదాడి మొదలుపెట్టేసింది. కాంగ్రెస్ పై పెట్టిన ట్వీట్ ను డిలీట్ చేసుకోవడం ద్వారా సావర్కర్ వారసత్వాన్ని ఫడ్నవీస్ నిలబెట్టారంటూ కాంగ్రెస్ సెటైర్లు వేస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల పూర్తి ఫలితాలు రాకముందే ఫడ్నవీస్ పెద్ద బాణాన్ని సంధించారని, కానీ కాంగ్రెస్ గెలుపుతో ఆ బాణం తిరిగి ఆయన గుండెలకే వచ్చి గుచ్చుకుందని తెలిపింది. దీంతో ఆయన ట్వీట్ డిలీట్ చేసుకోవాల్సి వచ్చిందని మహారాష్ట్ర కాంగ్రెస్ ట్వీట్ లో తెలిపింది. ఫడ్నవీస్ భయపడ్డారని, ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమేనని, 2029లో మహారాష్ట్ర ప్రజలు మీపై పెద్ద బాంబు వేయబోతున్నారని, దానికి ఈ ట్వీటే నాంది పలుకుతుందన్నారు. కాబట్టి తదుపరి దెబ్బకు సిద్దంగా ఉండాలని సీఎంకు సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+