Super CM: సౌత్ ఇండియాలో సూపర్ సీఎం ఎవరు ?, మైండ్ బ్లాక్, ఏకంగా రూ. 5 లక్షలు !
బెంగళూరు/హైదరాబాద్/విజయవాడ/చెన్నై: దక్షిణ భారతదేశంలో ప్రాంతీయ పార్టీల హవా ఉన్న విషయం తెలిసిందే. తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్. జగన్ ఇద్దరూ సొంత పార్టీలు పెట్టుకుని సీఎంలు అయ్యారు. ఇక కర్ణాటకలో బీజేపీ, కేరళలో కామ్రేడ్లు అధికారంలో ఉన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. రైతులను ఆదుకుంటామని ప్రతి ప్రభుత్వం హామీల మీద హామీలు ఇస్తోంది. ఇలాంటి సమయంలో సౌత్ ఇండియాకు చెందిన సీఎం అన్నదాతలకు ఊహించిన బంపర్ ఆఫర్ ఇచ్చారు. సీఎం ప్రకటనతో రైతులు చిందులు వేస్తున్నారు. సౌత్ ఇండియాలో సూపర్ సీఎం ఎవరు ? అనే విషయంపై చర్చ మొదలైయ్యింది.

మహానుభావులు లేకపోతే ?
భారతదేశంలో ఏ రాష్ట్రం అయినా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు రైతుల ప్రయోజనాలకు అదిక ప్రధాన్యత ఇస్తామని హామీలు ఇస్తుంటారు. కేంద్ర ప్రభుత్వం అయినా సరే రైతులకు ప్రధాన ఇస్తామని చెబుతారు. రైతులు లేకపోతే మనం జీవించలేమని జగం ఎరిగిన సత్యం. అది భారతదేశంలో అయినా, ప్రపంచ దేశాల్లో అయినా అదే జరిగేది. రైతులు మహానుభావులు కాబట్టే మనం మూడు పూటల కడుపుకు ఏదో ఒకటి తింటున్నాము.

సౌత్ ఇండియా మీద బీజేపీ కన్ను
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నార్త్ ఇండియాలో అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. సౌత్ ఇండిమా ఇప్పటికే కర్ణాటకలో పాగా వేసిన బీజేపీ ఇతర రాష్ట్రాల మీద కన్ను వేసింది. ఇలాంటి సమయంలో బీజేపీ వేసిన ప్లాన్ కు సౌత్ ఇండియాలో ఉన్న సీఎంలు షాక్ అయ్యారు. బీజేపీ మాస్టర్ ప్లాన్ తో ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే సామెతకు బదులుగా నాలుగైదు పిట్టలు కిందపడినట్లు అయ్యింది.

రైతులకు బంపర్ ఆఫర్
కర్ణాటకలో శుక్రవారం బడ్జెట్ ప్రవేశపెట్టారు. కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. కర్ణాటకలోని అన్నదాతలకు సున్నా వడ్డీతో రూ. 5 లక్షలు రుణం ఇవ్వడానికి కర్ణాటక ప్రభుత్వం అంగీకరించింది. రైతులు ఎలాంటి సమస్యలు లేకుండా క్షేమంగా మనం అందరూ సంతోషంగా ఉంటామని, అందుకే రైతులకు ఒక్కపైసా వడ్డీ లేకుండా రూ. 5 లక్షలు రుణం ఇస్తామని బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది.

దెబ్బకు దెబ్బ.... రూ. 3 లక్షలకు రూ. 5 లక్షలు కౌంటర్
కర్ణాటక బడ్జెట్ సమావేశాల్లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అన్నదాతల ఆర్థిక సాధికారతకు బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఈసారి వ్యవసాయ రంగం వృద్ధిరేటు 5.5 శాతంగా ఉందని సీఎం బసవరాజ్ బోమ్మయ్ చెప్పారు. రైతులకు సీఎం బసవరాజ్ బోమ్మయ్ పలు రాయితీలు కూడా ప్రకటించారు. బడ్జెట్‌లో భూ సిరి అనే కొత్త ప్రాజెక్టును తెరమీదకు తెచ్చారు. రైతులకు ఇచ్చే వడ్డీలేని రుణాన్ని రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచుతున్నామని సీఎం బసవరాజ్ బోమ్మయ్ ప్రకటించారు. వ్యవసాయ రంగంలో సాంకేతికత, శాస్త్రీయ పద్ధతులను అవలంబించడంతో రైతులు అవగాహనతో నిర్ణయాలు తీసుకునేలా మా ప్రభుత్వం అనుబంధ చర్యలను అమలు చేస్తుందని సీఎం బసవరాజ్ బోమ్మయ్ చెప్పారు.

సౌత్ ఇండియా సూపర్ సీఎం
సౌత్ ఇండియాలో రైతుల ప్రయోజనాల కోసం ఏ సీఎం తీసుకోని నిర్ణయం మా సీఎం బసవరాజ్ బోమ్మయ్ తీసుకున్నారని బీజేపీ నాయకులు అంటున్నారు. రైతులు బాగుంటే అందరూ బాగుంటారని, అందుకే సున్నా వడ్డీతో రైతులకు రూ. 5 లక్షల వరకు రుణాలు మంజూరు చెయ్యడానికి కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని బీజేపీ కార్యకర్తలు అంటున్నారు. మొత్తం మీద కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం రైతుల కోసం వడ్డీ లేకుండా రూ. 5 లక్షల వరకు రుణాలు మంజారు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications