థర్డ్ ఫ్రంట్: రేపు బెంగళూరులో దేవేగౌడతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్/బెంగళూరు: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం మాజీ ప్రధాని దేవేగౌడను కలవనున్నారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంతో వివిధ రాజకీయ పార్టీలతో ఆయన సమావేశమవుతోన్న విషయం తెలిసిందే.

ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. అనంతరం జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ హైదరాబాద్ వచ్చి కేసీఆర్‌తో భేటీ అయ్యారు.

CM KCR to meet former prime minister Deve Gowda in bangalore tomorrow

తాజాగా ఆయన దేవేగౌడతో మాట్లాడనున్నారు. శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నలభై అయిదు నిమిషాలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్తారు.

దేవేగౌడతో దేశ రాజకీయాలు, థర్డ్ ఫ్రంట్ అంశంపై చర్చిస్తారు. ఆ తర్వాత తిరిగి సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana Chief Minister K Chandrasekahr Rao to meet former prime minister Deve Gowda in bangalore tomorrow.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X