వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శరద్ పవార్‌తో కేసీఆర్ భేటీ.. రాజకీయాలపై చర్చ..

|
Google Oneindia TeluguNews

సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేశారు. ఇతర రాష్ట్రాల సీఎంలు/ పార్టీ అధినేతలను వరసగా కలుస్తున్నారు. గతంలో కూడా ఫెడరల్ ఫ్రంట్ అని హడావిడి చేశారు. కానీ బీజేపీకి తిరుగులేని మెజార్టీ వచ్చింది. ఇప్పుడు కూడా ఎన్నికలకు సమయం ఉన్నా.. ఇప్పటినుంచే ఒక్కో పార్టీ అధినేతను కలుస్తూ వస్తున్నారు. ఇవాళ ముంబై వెళ్లిన కేసీఆర్.. తొలుత మహారాష్ట్ర సీఎం, శివసేన అధినేత ఉద్దవ్ థాకరేను కలిశారు. తర్వాత ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను మీట్ అయ్యారు. ఇద్దరు బిగ్ షాట్‌లను కలువడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పుడు వీరి నేతృత్వంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే.

పవార్‌తో సాన్నిహిత్యం..

ఇప్పుడే కాదు గతంలో కూడా శరద్ పవార్‌తో మంచి సాన్నిహిత్యం ఉంది. ఇవాళ ఆయనను కేసీఆర్ కలిశారు. 1969 ఉద్య‌మ స‌మ‌యం నుంచి శ‌ర‌ద్ ప‌వార్ తెలంగాణ‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించార‌ని కేసీఆర్ గుర్తుచేశారు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కూడా ఆయ‌న తెలంగాణ‌కు మ‌ద్ద‌తు ఇస్తూనే ఉన్నార‌ని సీఎం కేసీఆర్ వివరించారు. అతి చిన్న వ‌య‌సులోనే సీఎంగా పాల‌న సాగించిన ఘ‌న‌త శ‌ర‌ద్ ప‌వార్‌ది అని కొనియాడారు. దేశంలోనే శ‌ర‌ద్ ప‌వార్ సీనియ‌ర్ నేత‌ అని చెప్పారు.

దళితుల వికాసం లేదు

దేశం ప్ర‌స్తుతం స‌రైన మార్గంలో న‌డ‌వ‌డం లేదని కేసీఆర్ అన్నారు. ద‌ళితుల వికాసం లేదని.. స్వాతంత్ర్యం వ‌చ్చిన ఇన్నేళ్ల త‌ర్వాత కూడా దేశంలో స‌రైన పాల‌న లేదని చెప్పారు. దేశం కోసం.. స‌రైన అజెండ ఉండాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. దేశంలో అత్యంత అనుభ‌వం ఉన్న నేత శ‌ర‌ద్ ప‌వార్ అని వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో శ‌ర‌ద్ ప‌వార్ ఇచ్చిన మ‌ద్ద‌తును ఎప్ప‌టికీ మ‌ర‌వ‌లేమని చెప్పారు. ఖ‌చ్చితంగా త‌మ‌తో క‌లిసి ప‌నిచేస్తా అన్నారని పేర్కొన్నారు.

త్వరలో భేటీ..


అంద‌రం మ‌ళ్లీ భేటీ అవుతామని.. ఇంకా ఇత‌ర నేత‌ల‌తో కూడా మాట్లాడి ముందుకు వెళ్తామని కేసీఆర్ తెలిపారు. అంద‌రినీ క‌లుపుకొని వెళ్తామని చెప్పారు. కొన్ని రోజుల త‌ర్వాత ప్ర‌జ‌ల ముందు మా అజెండ పెడ‌తామని తెలిపారు. కార్య‌ాచ‌ర‌ణ ఏంటో త్వ‌ర‌లో తెలియ‌జేస్తాం అని సీఎం కేసీఆర్ తెలిపారు.

English summary
telangana cm kcr meets ncp chief sharad pawar. they discuss various political issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X