ఫ్రంట్‌లో మరో ముందడుగు : పినరయితో కేసీఆర్ కీలక చర్చలు
తిరువనంతపురం : ప్రముఖ పుణ్యక్షేత్రం అనంత పద్మనాభస్వామివారిని సీఎం కేసీఆర్ సతీసమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కేసీఆర్ దంపతులకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. వారికి ఆశీర్వాదం అందజేసి .. తలపెట్టిన కార్యక్రమం విజయం కావాలని నిండుమనస్సులో దీవించారు.

కీలక చర్చలు
ఆ తర్వాత కేరళ సీఎం పినరయి విజయన్ తో సీఎం కేసీఆర్ సమావేశబయ్యారు. దేశంలోని తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించారు. లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న తీరు, ఫలితాల సరళి ఎలా ఉండబోతోంది, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ఆవశ్యకత, బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఇతర పార్టీలు ఏకమయ్యేందుకు నిర్వహించాల్సిన పాత్ర తదితర అంశాలపై కీలకంగా చర్చించినట్లు సమాచారం. ఇప్పటికే మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, మాయావతి తదితర నేతలతో కేసీఆర్ చర్చలు జరిపారు.

హార్టీ వెల్ కం
అంతకుముందు సీఎం కేసీఆర్ కు విమానాశ్రయంలో తెలుగు సంఘాల ప్రతినిధుల నుంచి ఘనస్వాగతం లభించింది. సీఎం కేసీఆర్ వెంట ఎంపీలు వినోద్, సంతోష్ పలువురు నేతలు ఉన్నారు.












Click it and Unblock the Notifications