G20 summit: రాష్ట్రపతి విందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం.. కేసీఆర్ వెళ్తారా..!
భారత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జీ20 సదస్సు దేశ రాజధాని ఢిల్లీ ప్రగతి మైదాన్ లోని భారత్ మండపంలో ప్రారంభం అయింది. జీ20 సదస్సు సందర్భంగా ఈ సదస్సుకు హాజరైన వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులుతో పాటు దేశంలోని ప్రముఖులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మ విందు ఇస్తారు. ఈ విందుకు దేశవ్యాప్తంగా 170 మంది ప్రముఖలకు ఆహ్వానాలు అందాయి. వీరిలో రాష్ట్రాల సీఎంలు, కేంద్ర కేబినెట్, పలువురు రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రముఖులు ఉన్నారు.
ఢిల్లీలో భారత మండపంలో రాష్ట్రపతి విందు ఇవ్వనున్నారు. ఈ విందుకు రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్‌తో పాటు ఆయన భార్య సుదేష్ ధంకర్, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్,మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరుకానున్నారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, నరేంద్ర సింగ్ తోమర్, ఎస్ జైశంకర్, అర్జున్ ముండా, స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, ప్రహ్లాద్ జోషి హాజరు కానున్నారు.

ఇక ముఖ్యమంత్రుల విషయానికొస్త.. ఏపీ సీఎం జగన్, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘెల్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు ఆహ్వానం అందింది.
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, మణిపూర్ సీఎం ఎన్.బీరెన్ సింగ్, మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా, మిజోరం సీఎం జోరంతంగా, నాగాలాండ్ సీఎం నైఫియు రియో, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, పుదుచ్చేరి సీఎం రంగస్వామి, పంజాబ్ సీఎం భగవాన్ సింగ్ మాన్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సిక్కిం సీఎం పీఎస్ గోలాయ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, తెలంగాణ సీఎం కేసీఆర్, త్రిపుర సీఎం మాణిక్ షా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆహ్వానాలు అందాయి.












Click it and Unblock the Notifications