బాలీవుడ్ పెద్దన్నకు రాఖీ కట్టిన దీదీ: అసలు భారత రత్న: ప్రతిపక్షాల భేటీ వేళ అనూహ్య చర్య

ముంబై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ- ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జట్టు కట్టిన ప్రతిపక్ష పార్టీలు మూడో విడత భేటీకి సన్నద్ధమౌతోన్నాయి. ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో ముంబైలో భేటీ కానున్నాయి. 27 పార్టీలు ఈ సమావేశానికి హాజరు కానున్నాయి.

దేశవ్యాప్త ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే ఇండియా పేరుతో కూటమి కట్టిన విషయం తెలిసిందే. గతంలో పాట్నా, బెంగళూరుల్లో భేటీ అయ్యాయి. మూడోసారి ముంబైలో ఉమ్మడి భేటీని నిర్వహించబోతోన్నాయి. ఇప్పటికే భాగస్వామ్య పార్టీల అధినేతలు ముంబైకి చేరుకున్నారు. ఈ విడత సమావేశంలోనే ఇండియా లోగోను కూడా ఆవిష్కరించనున్నాయి.

 CM Mamata Banerjee tied rakhi to Amitabh Bachchan at his residence

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ముంబైకి చేరుకున్నారు కూడా. ఈ మధ్యాహ్నం ముంబైకి వచ్చిన ఆమె నేరుగా జుహూలోని అమితాబ్ బచ్చన్ నివాసానికి వెళ్లారు. ఆయనను మర్యాదపూరకంగా కలుసుకున్నారు. రాఖీ కట్టి, శుభాకాంక్షలు తెలియజేశారు.

 CM Mamata Banerjee tied rakhi to Amitabh Bachchan at his residence

తమ ఇంటికి వచ్చిన మమత బెనర్జీని అమితాబ్ బచ్చన్ కుటుంబ సభ్యులు సాదరంగా ఆహ్వానించారు. అమితాబ్ భార్య, రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్ ఆప్యాయంగా మమతను ఆలింగనం చేసుకున్నారు. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ వారి కూతురితో కలిసి గ్రూప్ ఫొటో దిగారు.

అనంతరం మమత బెనర్జీ.. విలేకరులతో మాట్లాడారు. తన దృష్టిలో అసలు సిసలు భారతరత్న అమితాబ్ బచ్చనేనని తేల్చి చెప్పారు. ముంబైకి వచ్చినప్పుడు తన ఇంటికి రావాలని ఆహ్వానించారని పేర్కొన్నారు. దసరా పండగ సందర్భంగా కోల్‌కతలో జరిగే దుర్గాదేవి పూజలకు హాజరు కావాలని బచ్చన్ కుటుంబాన్ని కోరినట్లు వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+