Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇక సెలవ్.. బీహార్ లో ముగిసిన నితీష్ శకం..!!

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన రాజ్యసభ ప్రస్థానంపై స్పందించారు. కీలక ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం, తనయుడి రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. రాజ్యసభకు వెళ్లబోతోన్నానని ప్రకటించారు. పెద్దల సభలో అడుగు పెట్టాలనేది తన ఆకాంక్షగా అభివర్ణించారు. కొత్తగా ఏర్పడనున్న బీహార్ ప్రభుత్వానికి సంపూర్ణ సహాయ సహకారాలు, మార్గదర్శకత్వాన్ని అందిస్తానని చెప్పారు. దీనిపై తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ పెట్టారు.

రెండు దశాబ్దాలకు పైగా బీహార్‌కు సేవ చేసిన తర్వాత తన పాత కలను నెరవేర్చుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు. శాసనసభ, శాసన మండలితో పాటు లోక్‌సభ, రాజ్యసభ సహా నాలుగు సభల్లో సభ్యుడిగా ఉండాలనేది సుదీర్ఘ స్వప్నమని నితీష్ కుమార్ పేర్కొన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా బీహార్ అభివృద్ధికి తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వానికి తన పూర్తి మద్దతు, మార్గదర్శకత్వం లభిస్తుందని భరోసా ఇచ్చారు.

CM Nitish Kumar Announces Move to Rajya Sabha and Endorses New Bihar Government Seeking Support

గత రెండు దశాబ్దాలకు పైగా బీహార్ ప్రజలు తనపై విశ్వాసాన్ని ఉంచారని, అంచనాలకు మించిన మద్దతు ఇచ్చారని నితీష్ కుమార్ తెలిపారు. ఆ ప్రజాబలంతోనే బీహార్‌కు పూర్తి నిబద్ధతతో సేవ చేశానని పేర్కొన్నారు. బీహార్ సాధించిన అభివృద్ధి, దేశవ్యాప్తంగా సంపాదించిన గౌరవ మర్యాదలకు- కొత్తగా ఏర్పడే ప్రభుత్వం బంగారు బాటలు వేస్తోందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రభుత్వానికీ సంపూర్ణ మద్దతు తెలియజేయాలని కోరారు.

పార్లమెంటరీ జీవితాన్ని ప్రారంభించినప్పటి నుంచీ తనలో ఒక కోరిక ఉండేదని నితీష్ కుమార్ తెలిపారు. బీహార్ శాసన మండలి, శాసన సభతో పాటు రాజ్యసభ, లోక్ సభలో కూడా సభ్యుడిని కావాలనేది తన కల అని చెప్పారు. ఈ తాజా ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుడిని కావాలని తన సుదీర్ఘ కల నిజం కావాలని కోరుకుంటున్నాను" అని నితీష్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలతో కలిసి అభివృద్ధి చెందిన బీహార్‌ను నిర్మించాలనే సంకల్పం యధాతథంగా ఉంటుందని తెలిపారు.

మరోవంక- నితీష్ కుమార్ నిర్ణయాన్ని జనతాదళ్ (యునైటెడ్) నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తోన్నారు. ఆయన నివాసం వెలుపల పెద్ద సంఖ్యలో గుమిగూడారు. రోడ్డుపై బైఠాయించారు. నిరసనలకు దిగారు. తన నిర్ణయాన్ని మార్చుకోవాలంటూ నినాదాలు చేశారు. ఇది తమకు ఆమోదయోగ్యం కాదంటూ నినదించారు. ఈ ఆందోళన సందర్భంగా బీజేపీ, జేడీయూ నాయకుల మధ్య తోపులాట జరిగినట్లు సమాచారం.

Take a Poll

More From
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+