Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Next CM: కర్ణాటక కాబోయే సీఎం, ఇంకా డిసైడ్ చెయ్యలేదు, పార్లమెంటరీ కమిటీలో నిర్ణయం, సింగ్ !

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్. యడియూరప్ప బాధ్యతల నుంచి తప్పుకున్న సమయంలో ఆ రాష్ట్రంలో బీజేపీ వారసుడు ఎవరు ? అనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని బీజేపీ సీనియర్ నాయకుడు అరుణ్ సింగ్ అన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి పేరు త్వరలో ప్రకటిస్తామని కర్ణాటక బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జ్ అయిన అరుణ్ సింగ్ అన్నారు. త్వరలో జరగబోయే బీజేపీ పార్లమెంటరీ కమిటీ మీటింగ్ లో కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఎవరు ? అనే విషయంపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని బీజేపీ సీనియర్ నేత అరుణ్ సింగ్ మీడియాకు చెప్పారు.

 ఫస్ట్ ఇక్కడే చర్చ

ఫస్ట్ ఇక్కడే చర్చ


కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోతున్న బీఎస్. యడియూరప్ప వారసుడు ఎవరు ? అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అరుణ్ సింగ్ అన్నారు. సోమవారం ఢిల్లీలోని నివాసంలో అరుణ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ కమిటీ మీటింగ్ లో కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఎవరు ? అనే విషయంపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని బీజేపీ సీనియర్ నేత అరుణ్ సింగ్ మీడియాకు చెప్పారు.

బెంగళూరులో మరో మీటింగ్

బెంగళూరులో మరో మీటింగ్

ఢిల్లీలో పార్లమెంటరీ కమిటీ మీటింగ్ లో చర్చించిన తరువాత పరిశీలకులు బెంగళూరు చేరుకుని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు తెలుసుకుంటారని అరుణ్ సింగ్ స్పష్టం చేశారు. కర్ణాటకలోని బీజేపీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకున్న తరువాత వారు ఏం చెప్పారు అనే పూర్తి సమాచారం బీజేపీ హైకమాండ్ కు పంపిస్తామని అరుణ్ సింగ్ అన్నారు.

Recommended Video

    Karnataka Politics Audio Clip Leaked In Karnataka Increase Heat Over CM Yediyurappa Resign Issue
    సీఎం పేరు ఇంకా ఫైనల్ కాలేదు ?

    సీఎం పేరు ఇంకా ఫైనల్ కాలేదు ?

    కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు ? అనే విషయంలో బీజేపీ హైకమాండ్ సరైన నిర్ణయం తీసుకుంటుందని, సరైన నాయకుడిని సీఎం చేస్తామని అరుణ్ సింగ్ అన్నారు. అయితే కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు అనే విషయంలో మీరు ఇంకా నిర్ణయం తీసుకోలేదా ? అని మీడియా ప్రశ్నిస్తే అందుకు అరుణ్ సింగ్ అవునని, కాదని కచ్చితంగా సమాధానం చెప్పలేదు.

    త్వరలో గుడ్ న్యూస్ చెబుతాం ?

    త్వరలో గుడ్ న్యూస్ చెబుతాం ?

    కర్ణాటక బీజేపీ శాఖ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ ఢిల్లీకి పరుగు తీశారు. ముఖ్యమంత్రి రేసులో ఉన్న బీజేపీ సీనియర్ నేత మురగేష్ నిరాణి ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు. ముఖ్యమంత్రి రేసులో మరో 8 మంది సీనియర్ నాయకులు, మంత్రులు ఉన్నారు. అయితే బీజేపీ అధిష్టానం ఎవరిని కర్ణాటక సీఎం కుర్చీ కట్టబెడుతుంది ? అని విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+