CM Seat: సంక్షోభం అంచుల వరకు వెళ్లి అగిపోయింది, కుర్చీ ఉంటుందో, ఊడుతుందో సీఎంకే క్లారిటీ లేదు!
ముంబాయి/న్యూఢిల్లీ/సూరత్: శివసేన పార్టీ రెబల్ నాయకుడు, మంత్రి ఏక్ నాథ్ షిండే దెబ్బకు మహారాష్ట్రలోని ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ కూటమి సంక్షోభం అంచుల వరకు వెళ్లి అక్కడ ఆగింది. మహారాష్ట్రంలో సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఉంటుందా ? ఊడుతుందా ? అనే విషయంలో ఇంత వరకు క్లారిటీ లేకపోయినా ఎవరి లెక్కలు వాళ్లకు ఉన్నాయి. రెబల్ మంత్రి ఏక్ నాథ్ షిండేకు మద్దతు ఇస్తున్న శివసేన ఎమ్మెల్యేల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఉన్న ఎమ్మెల్యేలు చెయ్యిజారిపోకుండా ఉద్దవ్ ఠాక్రే అనుచరులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే మహారాష్ట్రలో ప్రభుత్వం పడిపోకుండా ఉండటానికి ఉద్దవ్ ఠాక్రే అనే చర్యలు తీసుకుంటున్నారు. ఏక్ నాథ్ షిండేతో పాటు శివసేన రెబల్ ఎమ్మెల్యేలు సామూహిక రాజీనామాలు చేస్తే లెక్క ఓ రకంగా ఉంటుంది. బీజేపీ నాయకులు చెబుతున్న మాటల ప్రకారం లెక్క మరో రకంగా ఉంటోంది. మొత్తం మీద మహారాష్ట్రలో ప్రభుత్వం నిలబడాలంటే ఈ లెక్కన మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంటుంది.

మహారాష్ట్రాలో ఎంత మంది ఎమ్మెల్యేలు అంటే?
మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం శాసనసభ్యుల సంఖ్య 288, ప్రస్తుతం ఉద్దవ్ ఠాక్రే మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వానికి 152 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఇటీవల శివసేన ఎమ్మెల్యే మరణించడంతో శాసన సభ్యుల సంఖ్య 287గా ఉంది. అసెంబ్లీలో 144 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటేనే ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి అవకాశం ఉంటుంది

వాడికంటేనా
ఏ పార్టీకి ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే!
బీజేపీ- 106 మంది ఎమ్మెల్యేలు
శివసేన- 55 మంది ఎమ్మెల్యేలు
కాంగ్రెస్- 44 మంది ఎమ్మెల్యేలు
ఎన్సీపీ- 53 మంది ఎమ్మెల్యేలు

ఎవరి లెక్కలు వాళ్లవే
మిగిలి చిన్నచిన్న పార్టీల ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంతకాలం చిన్నచిన్న పార్టీల ఎమ్మెల్యేల మద్దతు మాకే ఉందని ఉద్దవ్ ఠాక్రేలోని సంకీర్ణ ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇప్పుడు మహారాష్ట్రలో ఉద్దవ్ ఠాక్రే సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోతే మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ నాయకులు ధీమాగా చెబుతున్నారు. మా పార్టీలోని 106 మంది ఎమ్మెల్యేలతో పాటు మాకు మద్దతు ఇచ్చే వారి సంఖ్య 135 ఉందని బీజేపీ నాయకులు అంటున్నారు.

అంతా ఏక్ నాథ్ చేతిలో ఉంది
శివసేనకు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం గుజరాత్ లోని సూరత్ లోని హోటల్ లో ఉంటున్నారు. అయితే శివసేన పార్టీ బలం 33కు పడిపోయింది. రెబల్ మంత్రి ఏక్ నాథ్ షిండేతో పాటు రెబల్ ఎమ్మెల్యేలు అందరూ సామూహిక రాజీనామాలు చేస్తే పరిస్థితి మరోరకంగా మారిపోయే అవకాశం ఉంది.
అప్పుడు మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వ బలం 130కి పడిపోతుంది. అప్పుడు అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 265కు పడిపోతుంది. అలాంటి సమయంలో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలంటే 133 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం అవుతోంది.

సీఎం అనుచరులు అలర్ట్
మహారాష్ట్ర రెబల్ మంత్రి ఏక్ నాథ్ షిండేకు మద్దతు ఇస్తున్న శివసేన ఎమ్మెల్యేల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఉన్న ఎమ్మెల్యేలు చెయ్యిజారిపోకుండా ఉద్దవ్ ఠాక్రే అనుచరులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మహారాష్ట్రలో ప్రభుత్వం పడిపోకుండా ఉండటానికి ఉద్దవ్ ఠాక్రే అనే చర్యలు తీసుకుంటున్నారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications