CM seat: సీఎం సీటు హుష్ కాకి, పరువు పోకూడదని ఈనిర్ణయం, బలపరీక్షకు బ్రేక్ ?, ఏక్ నాథ్ వర్గంలో పండగ !
ముంబాయి/గుహవాటి: శివసేన పార్టీ రెబల్ నాయకుడు, మంత్రి ఏక్ నాథ్ షిండే దెబ్బకు మహారాష్ట్రలోని ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ కూటమి సంక్షోభం అంచుల వరకు వెళ్లి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సీఎం ఉద్దవ్ ఠాక్రే రాజీనామాతో మహారాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపు తిరిగింది. రేపు జరగబోయే పరిస్థితి ఊహించి ముందుగానే పరువు కాపాడుకోవడానికి సీఎం ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేశారని ప్రతిపక్షాలు, కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నాయి.
మహారాష్ట్రంలో సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఉంటుందా ? ఊడుతుందా ? అనే విషయంలో ఈ రోజు సాయంత్రం వరకు క్లారిటీ లేకపోయినా ఎవరి లెక్కలు వాళ్లకు ఉన్నాయి. రెబల్ మంత్రి ఏక్ నాథ్ షిండేకు మద్దతు ఇస్తున్న శివసేన ఎమ్మెల్యేల సంఖ్య పెరిగిపోవడంతో విధిలేని పరిస్థితిలో సీఎం ఉద్దవ్ ఠాక్రే ఆయన పదవికి రాజీనామా చేశారని కొందరు రాజకీయ నాయకులు అంటున్నారు.

రెబల్ ఎమ్మెల్యేలను ముంబాయి పిలిపించుకోవడానికి సీఎం ఉద్దవ్ ఠాక్రే, ఆయన మద్దతుదారులు అనేక ప్రయత్నాలు చేశారు. గవర్నర్, సుప్రీం కోర్టు ఆదేశాలతో ఉద్దవ్ ఠాక్రేకి వేరే మార్గం లేక సీఎ: పదవికి రాజీనామా చేశారని, రేపు అసెంబ్లీలో పరువు పోకముందే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయనకు సన్నిహితంగా ఉంటున్న ఓ నాయకుడు అన్నారు.
మహారాష్ట్రలో ప్రభుత్వం పడిపోకుండా ఉండటానికి ఉద్దవ్ ఠాక్రే అనేక చర్యలు తీసుకున్నా ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఆయన బలపరీక్షకు ఒక్కరోజు ముందుగానే ఎవ్వరూ ఊహించని విధంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే రాజీనామాతో శివసేన పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు పండుగ చేసుకుంటున్నారని తెలిసింది.












Click it and Unblock the Notifications