ముదిరిపోయిన కావేరి, అఖిలపక్ష సమావేశం, నలుగురు మాజీ సీఎంలు, ఏం జరిగినా !
బెంగళూరు/చెన్నై: తమిళనాడుకు కావేరీ జలాల విడుదల చేసే విషయంలో కర్ణాటకలోని అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కేఆర్‌ఎస్ రిజర్వాయర్ నీటిమట్టం 105 అడుగులకు పడిపోయిందని, తమిళనాడుకు నీటిని విడుదల చేయలేమని కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
కావేరి సమస్యపై చర్చించేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆగస్టు 23వ తేదీ బుధవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు ఎవరూ లేకపోవడంతో అఖిలపక్ష సమావేశానికి ఎవరు హాజరవుతారు? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అఖిలపక్ష సమావేశానికి బీజేపీకి చెందిన ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆహ్వానించారు.
బసవరాజ్ బోమ్మయ్, బీఎస్ యడియూరప్పను లేఖ ద్వారా ఆహ్వానించారు. ఫోన్ చేసి మాజీ ముఖ్యమంత్రి డీవీ. సదానంద గౌడను సమావేశానికి ఆహ్వానించారు. కావేరి నీటి విడుదలపై రాజకీయం చెయ్యకూడదని, అందూ కలిసి నిర్ణయం తీసుకోవాలని సిద్దరామయ్య అంటున్నారని తెలిసింది.

కావేరీ జలాలను తమిళనాడుకు తరలించే అంశం రాజకీయాల కారణంగా ఏర్పడింది. కర్ణాటక రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా డ్యామ్‌లు నిండలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నీటి ఎద్దడిపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సోమవారం మండ్యలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు నిరసన చేపట్టారు.
ఉపముఖ్యమంత్రి, జలవనరుల శాఖ మంత్రి డీకే. శివకుమార్ కావేరి సమస్యపై వివరిస్తూ ట్వీట్ చేశారు. కావేరి నదీ జలాలపై ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించిందని అన్నారు. ప్రతిపక్షాలు వాళ్లు అధికారంలో ఉన్న సమమంలో తమిళనాడుకు ఎంత నీరు విడుదల చేశారనే సమాచారం మా దగ్గర ఉందని, వారికి మేము సమాధానం చెబుతామని డీకే శివకుమార్ అంటున్నారు.

కానీ కావేరీ నీరు వాస్తవ పరిస్థితి ఏమిటో మేము కోర్టుకు చెబుతామని సిద్దరామయ్య ప్రభుత్వం అంటోంది. కేఆర్ ఎస్ లో 22 టీఎంసీలు, కబినిలె 7 టీఎంసీలు, హారంగిలో 6 టీఎంసీలు, హేమావతిలో 20 టీఎంసీలు నీరు ఉందని డీకే శివకుమార్ ట్వీట్ ద్వారా తెలియజేశారు. '
కావేరి నీటి పంపిణి విషయంలో ఏం చేయాలో అన్ని లీగల్ టీమ్‌లతో చర్చిస్తున్నాం. అఖిలపక్ష సమావేశంలో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటాం. తమిళనాడుకు ఎక్కువ నీరు విడుదల చేయలేదని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పష్టం చేశారు. రాష్ట్ర రైతులను ఆదుకోవడమే మా లక్ష్యం. ప్రతిపక్షాలు ఏం మాట్లాడాలన్నా రాజకీయాలు చేస్తున్నాయని ప్రజలకు తెలుసని డీకే శివకుమార్ అన్నారు.

గత 30-40 ఏళ్లుగా కావేరి నీటి విషయంలో ఇలాంటి సమస్య లేదు. ప్రస్తుతం మన దగ్గర 55 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. వారికి 177.8 టీఎంసీలు వదలాలని, వాటి సాధకబాధకాలపై చర్చిస్తున్నామని డీకే శివకుమార్ అన్నారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిత్యం విమర్శలు గుప్పించే మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్. డి. కుమారస్వామిని కూడా అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించారు.
ఈ సమావేశానికి రావాల్సిందిగా మాజీ సీఎం హెచ్ డీజ కుమారస్వామిని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆహ్వానించారు. హెచ్. డీ. కుమారస్వామి ఈ సమావేశానికి హాజరవుతారా? లేదా జేడీఎస్ పార్టీ తరఫున రాష్ట్ర అధ్యక్షుడు సీఎం ఇబ్రహీం, మాజీ మంత్రి హెచ్. డీ. రేవణ్ణ హాజరు అవుతారా అని వేచి చూడాలని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.













Click it and Unblock the Notifications