సీఎం పచ్చి అపద్దాలు చెబుతున్నారు, మూడా స్కామ్ గురించి సిద్దూకు తెలుసు

కర్ణాటక ముఖ్యమంత్రిని ఆ పదవి నుంచి కిందకు దింపడానికి కాంగ్రెస్ పార్టీలోనే కుట్రలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ముడా కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్య చెప్పిన మరో అబద్ధం బట్టబయలైందని ఆయన మీద ఫిర్యాదు చేసిన స్నేహమయి కృష్ణ అంటున్నారు. ఈ విషయంలో ఫిర్యాదుదారు స్నేహమయి కృష్ణ స్వయంగా సీఎం సిద్దరామయ్యపై సంచలన ఆరోపణలు చేశారు.

రిట్ పిటిషన్ లో కోర్టును సీఎం సిద్దరామయ్య తప్పుదోవ పట్టించారని స్నేహమయి కృష్ణ ఆరోపించారు. దీంతో సీఎం సిద్దరామయ్యకు మరో సమస్య వచ్చే అవకాశం ఉందని న్యాయనిపుణలు అంటున్నారని కన్నడ మీడియా అంటోంది. స్నేహమయి కృష్ణ గురువారం మీడియాతో మాట్లాడుతూ ఈ కేసు గురించి అందరికి అంతా తెలిసినా సీఎం సిద్దరామయ్య అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. ముడాకు తన భార్య రాసిన లేఖ గురించి తనకు తెలియదని సీఎం సిద్ధరామయ్య అన్నారు.

CM Siddaramaiah is accused of telling lies in Muda scam

అయితే గవర్నర్ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు సీఎం సిద్దరామయ్య ఇచ్చిన సమాధానంలో సంచలన సమాచారం ఉందని తెలిసింది. నా భార్య ముడాకు లేఖ రాయలేదని చెబుతున్న సీఎం సిద్దరామయ్య దీనివల్ల ఇబ్బంది పడ్డారని తెలిసింది.

కర్ణాటక గవర్నర్‌కు సీఎం సిద్దరామయ్య ఇచ్చిన సమాధానంలో తన సతీమణి ముడాకు లేఖ రాసినట్లు సీఎం తెలిపారు. 3.16 ఎకరాల భూమికి బదులుగా తనకు ఫ్లాట్లు ఇవ్వాలని 2014 జూన్ 23వ తేదీన సీఎం సిద్దరామయ్య సతీమణి పార్వతి ముడాకు లేఖ రాశారు. ఈ లేఖకు సంబంధించిన పూర్తి సమాచారం సీఎం సిద్దరామయ్యకు తెలుసు అని ఆరోపణలు ఉన్నాయి.

నా భార్య ముడాకు రాసిన లేఖ రాసిన విషయం తనకు తెలియదని సీఎం సిద్దరాయయ్య ఇటీవల అన్నారు.

రిట్ పిటిషన్‌లో సీఎం సిద్దరామయ్య కోర్టును తప్పుదోవ పట్టించారని స్నేహమయి కృష్ణ ఆరోపించారు. ముడా కుంభకోణంపై స్నేహమయి కృష్ణ సీఎం సిద్దరామయ్యకు ఫిర్యాదు చేశారు. సిద్ధరామయ్య తన సతీమణి పార్వతి ముడాకు లేఖ రాసిన సంగతి తెలుసు అని స్నేహమయి కృష్ణ ఆరోపిస్తున్నారు. సిద్ధరామయ్య కోర్టులో మొత్తం 713 పేజీల డాక్యుమెంట్లతో కూడిన రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

సీఎం సిద్దరామయ్య కర్ణాటక రాష్ట్ర ప్రజలకు, న్యాయస్థానానికి నిజాలను దాచిపెడుతున్నారని స్నేహమయి కృష్ణ ఆరోపించారు. ఇదే అంశంపై గవర్నర్‌కు రాసిన లేఖలో కూడా సీఎం సిద్దరామయ్య వివరించారు.

షోకాజ్ నోటీసు ప్రత్యుత్తరంలోని 30వ పేరాల సీఎం సిద్దరామయ్య ఆయన భార్య లేఖ రాసిన సమాచారం ఇచ్చారని, ఈ లోపాలన్నీ కోర్టులో మాకు అనుకూలంగా మారతాయని, స్నేహమయి కృష్ణ అన్నారు. కోర్టు మా వాదనను విశ్వసించే అవకాశం ఉందని స్నేహమయి కృష్ణ మీడియాకు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+