సీఎంకు పెరుగుతున్న డిమాండ్, ఇతర రాష్ట్రాల్లో హవా, మా కోసం మీరే రావాలి, ఏం చేస్తారు!
2023లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు ఉచిత హామీలు ఇచ్చి ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలకు పెద్దఎత్తున సన్నాహాలు చేసి ఎన్నికల ప్రచారం జోరుగా సాగిస్తోంది. ఇప్పటికే కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థుల కోసం జోరుగా ప్రచారం నిర్వహిస్తున్న సీఎం సిద్ధరామయ్యకు సొంత రాష్ట్రంలోనే కాకుండా బయట రాష్ట్రాల్లో కూడా సిద్దరామయ్యకు భారీ డిమాండ్ ఏర్పడింది.
దృఢమైన నాయకుడిగా పేదల గుండెల్లో స్థానం సంపాదించుకున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇప్పటికే కర్ణాటకలోని పలు లోక్‌సభ నియోజకవర్గాల్లో నిరంతరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వివిధ రాష్ట్రాల్లో ప్రచారానికి ఆహ్వానాలు అందుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల తేదీ ప్రకటించడం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు లోక్‌సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగడంతో రాజకీయ పార్టీలు జోరుగా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.

లోక్‌సభ సీటును కైవసం చేసుకునేందుకు ఒక్కో నియోజకవర్గం అభ్యర్థులు పలుకుబడి ఉన్న నేతలను ప్రచారానికి పిలుస్తుండడంతో కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లకు డిమాండ్ పెరుగుతోంది. కావేరి నుంచి గోదావరి దాకా సిద్దరామయ్య పేరు వింటే అవునా పులి అనే డైలాగ్ ను ఆయన అభిమానులు చెబుతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో సిద్దరామయ్యకు కు ఇతర రాష్ట్రాల్లోనూ ఫుల్ డిమాండ్ పెరిగిపోయిందని కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు.
మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాజధాని హైదరాబాద్ తో సహా పలు రాష్ట్రాల్లో కన్నడిగులు ఎక్కువగా నివాసం ఉంటున్న ప్రాంతాల నుంచి ఎన్నికల ప్రచారం చెయ్యాలని సిద్దరామయ్యకు ఆహ్వానాలు వచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిసింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఉచిత హామీల మేరకు అధికారంలోకి వచ్చింది. ఈ ఉచిత హామీల అస్త్రాన్ని ఉపయోగించి ఇతర రాష్ట్రాల్లో విజయలక్ష్మిని తమవైపు తిప్పుకోవాలని కాంగ్రెస్ తహతహలాడుతోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇప్పటికే బెంగళూరు సౌత్, బెంగళూరు నార్త్, బెంగళూరు సెంట్రల్, బెంగళూరు రూరల్ లో సిద్దరామయ్య లోక్ సభ ఎన్నికల ప్రచారం చేశారు.
అలాగే మైసూర్, మండ్య లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు పలు నియోజకవర్గాల్లో తమ అభ్యర్థుల తరపున సిద్దరామయ్య జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కర్ణాటకలోని వివిధ లోక్‌సభ నియోజకవర్గాల్లో కూడా ఎన్నికల ప్రచారం చెయ్యాలని నాయకులు డిమాండ్ చేస్తున్నారని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ఎన్నో ప్రజాకర్షణ పథకాలను అమలు చేస్తూ మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నేతలు ప్రచారానికి రావాలని సిద్దరామయ్యను కోరినట్లు సమాచారం.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications