బీజేపీవి నీచరాజకీయాలు.. దమ్ముంటే నన్ను జైల్లో పెట్టుకోండి ! : ఉద్దవ్ ఠాక్రే సవాల్ !!
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారం కోసం ఎంత నీచానికైనా దిగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వాన్ని టార్గెట్‌గా చేసుకుని దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తోందని దుయ్యబట్టారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడిన ఉద్దవ్ ఠాక్రే .. అధికారంలోకి రావాలంటే ప్రజా బలంతో రండి గానీ.. ఇలాంటి దుర్మార్గపు పనులు చేయకండి అని బీజేపీకి హితవు పలికారు.
నన్ను జైలుకు పంపండి
మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన కీలక నేతలపై ఇటీవల వరుసగా ఈడీ దాడులు జరుగుతున్నాయి. తాజాగా మనీ లాండరింగ్ కేసులలో సీఎం ఉద్దవ్ ఠాక్రే బావమరిది శ్రీధర్ మధవ్ పటాంకర్పై ఈడీ సోదాలు జరిపింది. సుమారు రూ. 6.45 కోట్ల ఆస్తులను స్థంభింపజేసింది. ఈడీ తమ బంధువుల ఆస్తులను సీజ్ చేయడం తనను లక్ష్యంగా చేసుకోవడమే అని ఉద్దవ్ తీవ్రంగా బీజేపీపై ద్వజమెత్తారు. తనను జైలుకు పంపాలనుకుంటే పంపండి గానీ.. చేతగాని తనంతో తమ కుటుంబ సభ్యులను ఎందుకు వేధిస్తున్నారని ప్రశ్నించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ తమ ఇష్టానుసారానికి ఉపయోగించుకుంటూ.. వాటిని దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు.

ఆదిత్య ఠాక్రే సన్నిహితులపై ఐటీ దాడులు
అంతకుముందు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే కుమారుడు, మంత్రి ఆదిత్య ఠాక్రేకు అత్యంత సన్నిహితులపై ఐటీ దాడులు జరిగాయి. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. బీజేపీకి అధికారంలోకి రావాలంటే రండి గానీ.. ఆ అధికారం ఇలాంటి నీచమైన దుర్మార్గపు పనులు చేయొద్దని సభలో ఉద్దవ్ ఠాక్రే దుయ్యబట్టారు. రాష్ట్రంలో అదికారంలోకి వచ్చేందుకు తమ నేతలను , బంధువులును జైల్లో పెట్టడం బీజేపీ లక్ష్యంమైతే.. ముందు నన్ను జైల్లో పెట్టండని సవాల్ విసిరారు. ఇలాంటి నీచమైన పనులు చేయవద్దని బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం బావమరిదిపై ఈడీ దాడులు
ఇటీవల కాలంలో ఉద్దవ్ సంకీర్ణ ప్రభుత్వంలోని కీలక నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు టార్గెట్ చేశాయి. ముమ్మర సోదాలు చేపట్టాయి. తొలుత ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ను మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేసింది. అనంతరం మంత్రి నవాబ్ మాలిక్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఇద్దరు నేతలు జ్యుడిషియల్ కస్టడీలోనే ఉన్నారు. తాజాగా సీఎం ఉద్దవ్ సతీమణి రష్మీ సోదరుడు శ్రీధర్ మధవ్ పటాంకర్ పై కూడా ఈడీ సోదాలు జరిపింది. రూ.6.45 కోట్లను సీజ్ చేసింది. అటు మంత్రి ఆదిత్య ఠాక్రేకు సన్నిహితులపై ఐటీ దాడులకు దిగింది. దీంతో బీజేపీ తీరుపై ఉద్దవ్ ఠాక్రే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమ ప్రభుత్వ భాగస్వామ్య పార్టీ నేతలతో పాటు తమ కుటుంబ సభ్యులను కూడా బీజేపీ టార్గెట్ చేసుకుని కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆగ్రహాం వ్యక్తం చేశారు. మహారాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేందుకు ఇలాంటి నీచరాజకీయాలకు బీజేపీ దిగిందని ఉద్దవ్ మండిపడ్డారు












Click it and Unblock the Notifications