సీఎంగా విజయ్ సంచలన నిర్ణయం, విపక్షాలకు ఊహించని షాక్..!!
తమిళనాడు లో విజయ్ ప్రభుత్వం కొలువు తీరింది. అనేక ట్విస్టుల తరువాత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. భారీగా తరలి వచ్చిన అభిమానుల సమక్షంలో.. విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసారు. ఆ సమయంలో ఉద్వేగానికి లోనయ్యారు. ముఖ్యమంత్రి తన తొలి సందేశంలో ప్రజలకు కీలక హామీ ఇచ్చారు. అదే విధంగా ముఖ్యమంత్రి అయిన వెంటనే విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విపక్షాలకు ఊహించని షాక్ ఇచ్చారు.
తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సీఎంగా సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అతి ముఖ్యమైన మూడు కీలక కార్యక్రమాలపై సంతకాలు చేశారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేశారు విజయ్. మహిళా భద్రతపై రెండో సంతకం చేశారు. దీని ద్వారా మహిళల భద్రత కోసం షీటీమ్స్ తరహాలో ప్రత్యేక నిఘా విభాగం ఏర్పాటు చేయనున్నారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఈగల్ తరహా వ్యవస్థపై విజయ్ మూడో సంతకం చేశారు. విజయ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయటం సాధ్యం కాదని.. ప్రమాణ స్వీకారానికి ముందే విపక్షాలు టార్గెట్ చేసాయి. తామ అమలు చేసిన పథకాలు కొనసాగించాలని మాజీ సీఎం స్టాలిన్ కోరారు. విజయ్ కు ప్రభుత్వం మైనార్టీలో పడకుండా చూసుకోవటమే గగనమని.. పాలనలో సమస్యలు తప్పవనే విమర్శలు వినిపించాయి. కాగా.. తొలి సందేశం.. సంతకంలోనే విజయ్ తన లక్ష్యం ఏంటో స్పష్టం చేసారు.

విజయ్ తొలి మూడు సంతకాలతో
కాగా, తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం విజయ్ ఉద్వేగంతో చేసిన ప్రసంగం వైరల్ అవుతోంది. తన జీవితంలో చాలా కష్టాలు అనుభవించానన్న సీఎం విజయ్.. ఆకలి బాధలు అంటే ఏంటో తనకు తెలుసన్నారు. తనను అభిమానంగా పిలిచారు కాబట్టే రాజకీయాల్లోకి వచ్చానని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. 'నేను మీ కుటుంబ సభ్యుడి లాంటి వాడిని. సినిమాల్లో నన్ను ఉన్నతస్థాయిలో నిలిపారు. తమ్ముడూ రా.. అంటూ పిలిచారు కాబట్టే రాజకీయాల్లోకి వచ్చాను. నా ప్రయాణంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా. ఇది మీ ప్రభుత్వం.. డ్రగ్స్‌పై ఈ రోజు నుంచే పోరాటం ప్రారంభం' అని సీఎం విజయ్ అన్నారు. ప్రస్తుతం.. తమిళనాడు ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని విజయ్ తన ప్రసంగం ద్వారా వెల్లడించారు. గత ప్రభుత్వం ఖజానా మొత్తం ఖాళీ చేసిందని.. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని తెలిపారు. ఏది సాధ్యమో అది మాత్రమే చేస్తామని.. అనుకున్న లక్ష్యాలను సాధిస్తామని ముఖ్యమంత్రి వివరించారు. 'దిస్ ఈజ్ న్యూ బిగినింగ్. ప్రజా ధనాన్ని వృథా చేయను.. దోచుకోను. టీవీకేలో ఒకే ఒక అధికార కేంద్రం ఉంది.. అది విజయ్ మాత్రమే. నేను పవర్ సెంటర్.. మరో పవర్ సెంటర్ ఉండదు.. ఉండబోదని తేల్చి చెప్పారు













Click it and Unblock the Notifications