యోగి దెబ్బ: సింహాలూ చికెన్‌తోనే.. అర్థాకలితో!

Subscribe to Oneindia Telugu

లక్నో: ఉత్తరప్రదేశ్ కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టిన సీఎం యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలోని కబేళాలలను మూసివేయించిన సంగతి తెలిసిందే. దీనివల్ల మాంసం ప్రియుల ఇబ్బందుల సంగతి పక్కనబెడితే.. జూపార్క్ లోని వణ్యప్రాణుల తిండికి మాత్రం కరువు ఏర్పడింది.

లక్నో, ఇటావాలో ఉన్న జూపార్క్ లోని జంతువులకు ఇప్పుడు మాంసం కొరత ఏర్పడింది. దీంతో అధికారులు వాటికి చికెన్ తోనే సరిపెట్టాల్సి వస్తోంది. అయితే ఆ చికెన్ కూడా సరిపోయేంత సరఫరా కాకపోవడంతో మూగజీవాల ఆకలి తీరడం లేదు.

cm yogi adityanath decision of closing cow slaughters creating lot of problems

కాగా, యూపీలో కబేళాల మూసివేత పలు రంగాలపై తీవ్ర ప్రభావం చూసిస్తోంది. పాల ఉత్పత్తిలోను, మాంసం ఉత్పత్తిలోను ఇప్పటిదాకా అగ్రస్థానంలో ఉన్న యూపీ.. ఇకనుంచి ఆ స్థాయిలో ఉత్పత్తులు జరిపే అవకాశం లేదు. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి వస్తే అనధికారిక కబేళాలను, యంత్రాలను నడిచే కబేళాలను మూసివేసేందుకు చర్యలు తీసుకుంటామని యోగి ఎన్నికల సమయంలో ప్రకటించారు.

చెప్పినట్లుగానే అధికారంలోకి రాగానే దాన్ని అమలుపరిచారు. కబేళాల మూసివేతతో చర్మ పరిశ్రమ సైతం దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. దీని ద్వారా వేలాది మంది ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In line with the BJP's election manifesto, Uttar Pradesh Chief Minister Yogi Adityanath today directed police officials to prepare an action plan for closure of slaughter houses across the state.
Please Wait while comments are loading...