వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బుల్డోజర్లకు విశ్రాంతి ఇచ్చాం.. ఫలితాల తర్వాత అక్రమాస్తుల పనిపడతాం : సీఎం యోగి

|
Google Oneindia TeluguNews

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ వర్సెస్ సమాజ్ వాదీ పార్టీ అన్న విధంగా సాగుతున్నాయి. ఇరుపార్టీల నేతల మాటల దాడి తీవ్రమైంది. ప్రచారం పర్వంలో ఒకరిపై మరొకరు విమర్శలు , ప్రతి విమర్శలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. యూపీలో మరోసారి కమలానిదే గెలుపని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో దాక్కున్న అక్రమార్కుల ఆటకట్టిస్తామని హెచ్చరించారు.

 ప్రస్తుతం బుల్డోజర్లకు విశ్రాంతి

ప్రస్తుతం బుల్డోజర్లకు విశ్రాంతి

అసెంబ్లీ ఎన్నికల సమయంలో యోగి ప్రభుత్వం నేరస్తుల ఆస్తులపై బుల్ డోజర్లను నడపదంటూ సమాజ్ వాదీ పార్టీ వ్యాఖ్యలు చేసింది. ఎస్పీ వ్యాఖ్యలకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ తీవ్రంగా స్పందించారు. మెయిన్‌పురిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన బుల్డోజర్లు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అవి అక్రమ ఆస్తుల పనిపడతాయంటూ కౌంటర్ ఇచ్చారు. మార్చి 10 తర్వాత బుల్డోజర్లను ఉపయోగిస్తామంటూ హెచ్చరించారు.

 ఆక్రమాస్తులకు కూల్చేస్తాం

ఆక్రమాస్తులకు కూల్చేస్తాం

గత కొన్నేళ్లుగా దాక్కుని, అసెంబ్లీ ఎన్నికలు రాగానే బయటకు వచ్చిన దొంగలపై బుల్డోజర్లు ఉపయోగిస్తామని సీఎం యోగి స్పష్టం చేశారు. యంత్రాలు కదా.. వాటికి కూడా విశాంత్రి కావాలి కదా అని సెటర్లు విసిరారు. తమ బుల్డోజర్ల విషయంలో సమాజ్ వాదీ పార్టీ నేతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. బీజేపీ మరలా అధికారం చేపట్టగానే మరలా వాటిని ఉపయోగిస్తామని తేల్చిచెప్పారు. నేరస్తుల ఆక్రమాస్తులకు కూల్చేస్తామంటూ ఎన్నిక ప్రచారంలో పదే పదే సీఎం యోగి ప్రస్తావిస్తున్నారు.

 ఫిబ్రవరి 20న మూడో దశ పోలింగ్

ఫిబ్రవరి 20న మూడో దశ పోలింగ్


ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఇప్పటికే రెండు విడతల పోలింగ్ నిర్వహించారు . మూడో దశ పోలింగ్ ఫిబ్రవరి 20న జరగనుంది. దీనికి అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. మార్చి 10 ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అధికారం కోసం పార్టీలన్నీ సర్వశక్తులా కృషి చేస్తున్నాయి. ప్రధాన పోటీ మాత్రం బీజేపీ వర్సెస్ ఎస్పీ అన్న విధంగా నడుస్తోంది..

English summary
CM Yog adityanath satires on SP Chief Akhilesh Yadav
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X