అత్యంత ధనిక సీఎంగా జగన్- కేసీఆర్‌పై అత్యధిక క్రిమినల్ కేసులు: ఆ సీఎంకు ముగ్గురు భార్యలు

అమరావతి: అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించిన వ్యక్తిగత ఆస్తులు, స్థిరాస్తులు, క్రిమినల్ కేసులు, విద్యార్హత, గన్ లైసెన్సులు, అత్యధిక వాహనాలు.. ఇలా ఏడు అంశాలకు సంబంధించిన కీలక సమాచారం వెలువడింది. ప్రముఖ ఇంగ్లీష్ వెబ్ సైట్ ది ప్రింట్ దీనిపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. వారు దాఖలు చేసిన అఫిడవిట్స్‌ను దీనికి ప్రాతిపదికగా తీసుకుంది. దేశవ్యాప్తంగా 20 మంది ముఖ్యమంత్రులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని ఇందులో పొందుపరిచింది.

రిచ్చెస్ట్ సీఎంగా..

రిచ్చెస్ట్ సీఎంగా..

దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ నిలిచారు. ఆయన ఆస్తుల విలువ 370 కోట్ల రూపాయలు. వారసత్వంగా ఆయనకు అందిన వాటితో పాటు రాజకీయాల్లోకి రాకముందు ఓ పారిశ్రామికవేత్తగా ఆయన ఈ ఆస్తులను సంపాదించారు. స్థిరాస్తుల్లోనూ వైఎస్ జగన్ టాప్‌లో ఉన్నారు. ఈ కేటగరిలో రెండోస్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమాఖండు ఉన్నారు. ఆయన ఆస్తులు 132 కోట్ల రూపాయలు.

పేద ముఖ్యమంత్రిగా..

పేద ముఖ్యమంత్రిగా..

అతి తక్కువ ఆస్తులు ఉన్న ముఖ్యమంత్రిగా పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ అట్టడుగున నిలిచారు. ఆమె ఆస్తుల విలువ 15 లక్షల రూపాయలు మాత్రమే. ఆమె తరువాత కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్-రూ.72 లక్షలు, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్-రూ.56 లక్షలు, కర్ణాటక, హర్యానా ముఖ్యమంత్రు బసవరాజ్ బొమ్మై, మనోహర్ లాల్ ఖట్టర్-రూ.1.37 కోట్లు, రూ.1.27 కోట్ల రూపాయలతో ఆ తరువాతి స్థానాల్లో ఉన్నారు.

ఆ ముఖ్యమంత్రికి ముగ్గురు పెళ్లాలు..

ఆ ముఖ్యమంత్రికి ముగ్గురు పెళ్లాలు..

ఇప్పుడున్న ముఖ్యమంత్రుల్లో అయిదుమంది అవివాహితులు ఉన్నారు. మనోహర్ లాల్ ఖట్టర్- హర్యానా, నవీన్ పట్నాయక్- ఒడిశా, యోగి ఆదిత్యనాథ్- ఉత్తర ప్రదేశ్, ఎన్ రంగస్వామి- పుదుచ్చేరి, మమత బెనర్జీ - పశ్చిమ బెంగాల్ అవివాహితులు. సిక్కిం ముఖ్యమంత్రి తమాంగ్ బహుళ భార్యత్వాన్ని కలిగి ఉన్నారు. ఆయనకు ముగ్గురు భార్యలు ఉన్నారు. ఆ ముగ్గురు కూడా ప్రభుత్వ ఉద్యోగులే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

క్రిమినల్ కేసుల్లో కేసీఆర్ టాప్..

క్రిమినల్ కేసుల్లో కేసీఆర్ టాప్..

ముఖ్యమంత్రులందరిలోనూ అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్నది తెలంగాణ సీఎం కేసీఆర్‌పైనే. ఆయనపై అత్యధిక క్రిమినల్ కేసులు నమోదై ఉన్నట్లు ది ప్రింట్ తెలిపింది. ఈ కేటగిరీలో రెండో స్థానంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఉన్నారు. స్టాలిన్‌పై 47 కేసులు నమోదయ్యాయి. వైఎస్ జగన్‌పైనా చెప్పుకోదగ్గ స్థాయిలో కేసులు ఉన్నాయి. వాటి సంఖ్య 38. అశోక్ గెహ్లాట్-రాజస్థాన్, మమత బెనర్జీ, నవీన్ పట్నాయక్, సంగ్మా-మేఘాలయా, రియో-నాగాలాండ్, రంగస్వామిపై ఎలాంటి నేరారోపణలు లేవు. బీజేపీకి చెందిన 10 మంది ముఖ్యమంత్రులు కూడా క్లీన్ చిట్‌లో ఉన్నారని ది ప్రింట్ పేర్కొంది.

ఎవరి వద్ద ఎక్కువ వాహనాలు..

ఎవరి వద్ద ఎక్కువ వాహనాలు..

మనోహర్ లాల్ ఖట్టర్‌, పినరయి విజయన్‌, అశోక్ గెహ్లాట్‌, ఎంకే స్టాలిన్‌, కేసీఆర్‌, యోగి ఆదిత్యనాథ్‌, పుష్కర్ సింగ్ ధామి-ఉత్తరాఖండ్, మమత బెనర్జీలకు సొంత వాహనాలు లేవని అఫిడవిట్‌లు చెబుతున్నాయి. వైఎస్ జగన్ వద్ద నాలుగు వాహనాలు సొంత వాహనాలు. అందులో మూడు స్కార్పియోలు, ఒకటి బీఎండబ్ల్యూ. ఈ కేటగిరీలో పెమా ఖండూ తొలి స్థానంలో నిలిచారు. ఆయన వద్ద ఏడు వాహనాలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+