సిల్చార్ బోగీల్లో మంటలు .. హైరానా పడ్డ ప్రయాణికులు
డిస్పూర్ : నైరుతి రుతుపవనాల ఆగమనం కాస్త ఆలస్యం కావడంతో భానుడి భగ భగలతో చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఎండలకు బయటకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. ఇక అగ్నిప్రమాదాలు జరిగితే పరిస్థితే .. వేరు .. అది రైళ్లలో ఫైర్ యాక్సిడెంట్ జరుగడంతో ప్రయాణికులు నరకయాతన పడ్డ ఘటన అసోంలో చోటుజరింది.
బోగీల్లో మంటలు
అసోంలోని సిల్చార్-త్రివేండ్రం మధ్య ఎక్స్ ప్రెస్ ట్రైన్ వస్తోంది. ఇంతలో సిల్చార్ స్టేషన్ వద్దకు ఇవాళ తెల్లవారుజామున రాగానే రైలులోని మూడు బోగీల్లో పొగ దట్టంగా అలుముకుంది. వెంటనే రైలును నిలిపివేసి .. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ప్రస్తుతం మంటలను ఆర్పివేశామని .. ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.అగ్నిప్రమాదంలో ప్రయాణికులెవరు చనిపోలేదని పేర్కొన్నారు. గాయపడిన వారి వివరాలను కూడా రైల్వే అధికారులు మీడియాకు అందించలేదు.

ఎక్స్ ప్రెస్ రైలు స్లిపర్ కోచ్ నుంచి మంటలు ఎగిసిపడ్డడాయని అసోం ట్రైబ్యూన్ పేర్కొంది. అవి క్రమంగా పాంట్రీ .. అంటు నుంచి మిగిలిన బోగీలకు వ్యాపించాయని పేర్కొంది. అయితే ప్రమాదానికి గల కారణం ఇప్పటివరకు తెలియరాలేదని ... సంఘటనపై విచారణ జరుపుతున్నామని రైల్వే ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.












Click it and Unblock the Notifications