Cockroach Janta Party: ఢిల్లీలో మరో ర్యాలీ..! కాక్రోచ్ పార్టీ సంచలన నిర్ణయం..!

నీట్ అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యామంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ గత నెలలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపట్టి, అనుకున్న ఫలితం సాధించుకున్న కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) ఇప్పుడు మరో ఆందోళనకు సిద్ధమవుతోంది. ఇవాళ వర్చువల్ గా సమావేశమైన కాక్రోచ్ జనతా పార్టీ జాతీయ కార్యవర్గం.. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో వచ్చే నెల 5వ తేదీన భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించింది.

CJP: కాక్రోచ్ పార్టీకి మరో భారీ విజయం..! ఏకంగా 12,500 కోట్ల ఖర్చుకు సర్కార్ రెడీ..!
CJP: కాక్రోచ్ పార్టీకి మరో భారీ విజయం..! ఏకంగా 12,500 కోట్ల ఖర్చుకు సర్కార్ రెడీ..!

సెప్టెంబర్ 5న న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద శాంతియుత నిరసన ప్రదర్శనకు కాక్రోచ్ జనతా పార్టీ ఇవాళ పిలుపునిచ్చింది. జూలై 25న యువతరానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందా అనే దానిపై జాతీయ కార్యవర్గం తీవ్ర సందేహాలు వ్యక్తం చేసిందని కాక్రోచ్ జనతా పార్టీ సహ కన్వీనర్ సౌరవ్ దాస్ ట్వీట్ చేశారు. అందువల్ల, ఇండియా గేట్ నుండి న్యూఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయం వరకు సాగే శాంతియుత నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చిందన్నారు.

Cockroach Janta Party Announces Sept 5 Protest March From India Gate to Delhi Police HQ
కాక్రోచ్ లకు సుప్రీం బిగ్ షాక్..! రంగంలోకి మాజీ జడ్జి, మాజీ సీబీఐ ఛీఫ్..!
కాక్రోచ్ లకు సుప్రీం బిగ్ షాక్..! రంగంలోకి మాజీ జడ్జి, మాజీ సీబీఐ ఛీఫ్..!

ఆత్మహత్య చేసుకున్న నీట్ విద్యార్థుల కుటుంబాలు, జూలై 20 పోలీసుల దురాగత బాధితులు ఈ నిరసనకు నాయకత్వం వహిస్తారని సౌరవ్ దాస్ వెల్లడించారు. జెన్ జెడ్, యువ నిరసనకారులు, మృతుల కుటుంబాల విషయంలో కేంద్రం చేస్తున్న ఈ విశ్వాసఘాతాన్ని తాము అంగీకరించమని ఆయన తేల్చిచెప్పారు. కాబట్టి సెప్టెంబర్ 5న ఇండియా గేట్ వద్ద యువత మళ్లీ ఏకమవుతుందని సౌరవ్ దాస్ పేర్కొన్నారు. ఇప్పటికే కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్తంగా స్కూళ్లను బాగు చేసే కార్యక్రమానికి పిలుపునిచ్చింది. రాజస్థాన్ లో తాజాగా నిర్వహించిన ఆందోళనలు ఫలితాన్నివ్వడంతో అక్కడి ప్రభుత్వం ఏకంగా స్కూళ్ల రిపేర్లకు, కొత్త క్లాస్ రూమ్ లు, స్కూళ్ల కోసం రూ.12, 500 ఖర్చు చేయబోతున్నట్లు ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+