చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Car blas: కారులో ఏముంది ?, ముందుగానే షాక్ ఇచ్చిన ఎన్ఐఏ, మాచేతికి ఇచ్చేయండి !

|
Google Oneindia TeluguNews

కోయంబత్తూరు/చెన్నై: తమిళనాడులోని కోయంబత్తూరులో కోటేశ్వరన్ దేవాలయం (శివుడి గుడి) దగ్గర కారు పేలుడు జరిగిన కేసులో పోలీసులు సీసీటీవీ పుటేజీలు స్వాధీనం చేసుకున్నారు. కారు పేలుడులో సజీవదహనం అయిన జమేజా ముబిన్ అలియాస్ ముబిన్ గురించి అధికారులు పూర్తి సమాచారం బయటకు లాగుతున్నారు. ఇప్పటికే ఎన్ఐఏ నుంచి తప్పించుకుని కారు పేలుడులో సజీవదహనం అయిన ముబిన్ ఇంటిలో పోలీసులు పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే మళ్లీ ఎన్ఐఏ అధికారులు ఈ కేసులో ఎంట్రీ ఇవ్వడంతో కథ రసవత్తరంగా మారిపోయింది. కోయంబత్తూరు పేలుడుకు, ఉగ్రవాదులకు లింక్ ఉందని పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఎన్ఐఏ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. కోయంబత్తూరుతో పాటు తమిళనాడు పోలీసుల దగ్గర ఉన్న సాక్షాలు, ఈ కేసు వివరాలు మొత్తం ఎన్ఐఏకి అప్పగించడానికి రంగం సిద్దం చేశారు.

Actress: టాప్ హీరోయిన్ అర్దనగ్న ఫోటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసిన మేకప్ మేన్ !Actress: టాప్ హీరోయిన్ అర్దనగ్న ఫోటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసిన మేకప్ మేన్ !

 గుడి ముందే కారులో పేలుడు

గుడి ముందే కారులో పేలుడు

కోయంబత్తూరు సిటీలోని ఉక్కడం ఏరియాలోని కన్నప్పన్ నగర్ లోని పురాతన కోట ఈశ్వరన్ ఆలయం (శివుడి దేవాలయం) ముందు వేకువ జామున నాలుగు గంటల సమయంలో కారులో పేలుడు సంభవించింది. మొదట కారులో గ్యాస్ సిలిండర్ పేలడం వలన పేలుడు జరిగిందని మొదట పోలీసులు అనుకున్నారు.

 మ్యాటర్ మారిపోయింది

మ్యాటర్ మారిపోయింది

కారు పేలుడులో సజీవదహనం అయిన ముబిన్ గురించి అనేక విషయాలు బయటకు వచ్చాయి. పేలుడు జరిగిన రోజు రాత్రి ముబిన్ ఇంటి నుంచి ఐదు మంది రహస్యంగా గుర్తు తెలియని పదార్థాలు కారులో లోడ్ చేస్తున్న సీసీటీవీ పుటేజీలు పోలీసులకు చిక్కాయి. ఓటుపట్టరై ప్రాంతంలో నివాసం ఉంటున్న మోహమ్మద్ తల్కా, మోహమ్మద్ అజారుద్దీన్, మోహమ్మద్ రియాజ్, ఫైరోజ్ ఇస్మాయిల్, మోహమ్మద్ నవాజ్ ఇస్మాయిల్ అనే ఐదు మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

 ఎన్ఐఏ ఎంట్రీ

ఎన్ఐఏ ఎంట్రీ

ఉగ్రవాదులతో లింక్ పెట్టుకున్నాడని ఆరోపిస్తూ 2019లోల ఎన్ఐఏ అధికారులు ముబిన్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. ఆ రోజు ముబిన్ అతి ట్యాలెంట్ తో ఎన్ఐఏ అధికారుల నుంచి తప్పించుకుని ఇప్పుడు శివుడి ఆలయం ముందే సజీవదహనం అయ్యాడు. అయితే ఇప్పుడు మళ్లీ ముబిన్ కేసులో మళ్లీ ఎన్ఐఏ అధికారులు ఎంట్రీ ఇచ్చారు.

 మొత్తం ఇచ్చేయండి

మొత్తం ఇచ్చేయండి

కోయంబత్తూరు పేలుడుకు, ఉగ్రవాదులకు లింక్ ఉందని పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఎన్ఐఏ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. కోయంబత్తూరుతో పాటు తమిళనాడు పోలీసుల దగ్గర ఉన్న సాక్షాలు, ఈ కేసు వివరాలు మొత్తం ఎన్ఐఏకి అప్పగించడానికి రంగం సిద్దం చేశారు.

 అంత్యక్రియలకు వ్యతిరేకత ?

అంత్యక్రియలకు వ్యతిరేకత ?

కారు పేలుడులో చనిపోయిన ముబిన్ శవానికి ఐదు మంది వైద్యులు పోస్టుమార్టుం నిర్వహించారు. పోస్టుమార్టుం నిర్వహించే సమయంలో మొత్తం వీడియో రికార్డింగ్ చేశారు. ముబిన్ శవాన్ని అతని భార్య నస్రత్ కు అప్పగించారు. కోయంబత్తూరులోని స్మశానవాటికలో ముబిన్ అంత్యక్రియలు చెయ్యడానికి ముస్లీంలు కోందరు అభ్యంతరం వ్యక్తం చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

English summary
Coimbatore car blast case: NIA on the ground to investigate about the attack in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X