కాలేజ్ అమ్మాయితో ఒకే ఇంట్లో సహజీవనం, మ్యాటర్ రివర్స్, పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్య !

బెంగళూరు: ప్రియురాలు ఆత్మహత్య కేసు విచారణకు వచ్చిన యువకుడు పోలీస్ స్టేషన్ ఆవరణలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది. కేరళకు చెందిన నందకుమార్ (21) అనే యువకుడు పోలీసులకు భయపడి దురదృష్టవశాత్తు ఆవేశంలో ఆత్మహత్య చేసుకున్నాడని వెలుగు చూసింది.

ఆత్మహత్య కేసు విచారణ నిమిత్తం బెంగళూరు నగరంలోని రాజగోపాల్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చినప్పుడు నందకుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని బెంగళూరు నార్త్‌ డివిజన్‌ ​​డీసీపీ శివప్రకాష్‌ దేవరాజ్‌ తెలిపారు. రాజగోపాల్ నగర్ సమీపంలో కేరళకు చెందిన నందకుమార్, అక్షయ దంపతులు లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో జీవిస్తున్నారు.

deadbody

అక్షయ నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో పారా మెడికల్ చదువుతోంది. అయితే నందకుమార్ నిరుద్యోగి. వ్యక్తిగత విషయాలపై ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి తరచూ గొడవ పడుతుండేవారు. దీంతో మనస్తాపానికి గురైన అక్షయ గత జూన్ 14న ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు నందకుమార్‌పై మృతురాలు అక్షయ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

కేసు విచారణకు సంబంధించి విచారణకు హాజరుకావాలని నోటీసు రావడంతో నందకుమార్ రాజగోపాల్ నగర్ పోలీస్ స్టేషన్‌ లో హాజరయ్యాడు. విచారణ అనంతరం మరోసారి విచారణకు హాజరు కావాలని పోలీసులు అక్షయ ప్రియుడు నందకుమార్ కు సూచించారు. తరువాత నందకుమార్ పోలీస్ స్టేషన్ లో నుంచి బయటకు వచ్చేశాడు.

మరుసటి రోజు పోలీస్ స్టేషన్ కు వచ్చిన నందకుమార్ ఆ తర్వాత పోలీస్ స్టేషన్ వెనుకకు వెళ్లాడు. అక్కడ తాను ధరించిన పైజామా ప్యాంటుకు ఉన్న తాడుతో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాసేపటి తర్వాత పోలీసు సిబ్బంది మూత్ర విసర్జన చేసేందుకు స్టేషన్‌ వెనుకకు వెళ్లడంతో నందకుమార్ ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చిందని పోలీసు అధికారులు తెలిపారు. కేసు విచారణలో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+