College girl: ఫిజిక్స్ పాఠాలు చెప్పకుండా అమ్మాయిల ఫిజిక్ తో గేమ్స్ ఆడిన లెక్సరర్, డెత్ నోట్ లో !
చెన్నై/కోయంబత్తూరు: కాలేజ్ లో చదువుతున్న అమ్మాయి ఉన్నత విద్య అభ్యసించి మంచి ఉద్యోగం చెయ్యాలని అనుకుంది. ఇంటర్ సెకండ్ ఇయిర్ చదువుతున్న అమ్మాయి ఇంటర్ పూర్తి చేసి సాఫ్ట్ వేర్ ఇంజనీరు కావాలని కలలుకనింది. కాలేజ్ కు వెలుతున్న అమ్మాయి మీద అదే కాలేజ్ లో ఫిజిక్స్ లెక్చరర్ గా ఉద్యోగం చేస్తున్న కామాంధుడి కన్నుపడింది. కాలేజ్ లో చదువుతున్న అమ్మాయిలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్న ఆ అధ్యాపకుడు ఈ అమ్మాయి మీద ఎక్కువ ఆసక్తి చూపించి ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశాడని తెలిసింది. అధ్యాపకుడి లైంగిక వేధింపులు ఎక్కువ అయ్యాయి.
కరోనా వైరస్, లాక్ డౌన్ సమయంలో ఆన్ లైన్ క్లాసులు జరుగుతుంటే ఆ అమ్మాయికి ఫోన్ చేసిన అధ్యాపకుడు స్పెషల్ క్లాస్ ఉందని, నువ్వు కచ్చితంగా కాలేజ్ లో జరిగే క్లాసుకు హాజరుకావాలని చెప్పాడు. ఒంటరిగా ఆ అమ్మాయిని మాత్రమే బలవంతంగా కాలేజ్ కు పిలిపించిన కామాంధుడు ఆమె మీద లైంగిక దాడి చేశాడు. అప్పటి నుంచి పదేపదే ఆ అమ్మాయి మీద లైంగిక దాడి చేసి చిత్రహింసలకు గురి చేశాడు. కాలేజ్ అమ్మాయి కాలేజ్ యాజమాన్యంకు ఫిర్యాదు చెయ్యడంతో ఆ అధ్యాపకుడిని ఉద్యోగం నుంచి తొలగించారు. అయినా అతని చిత్రహింసలు భరించలేని కాలేజ్ అమ్మాయి ఆమె ఫ్రెండ్ కు ఫోన్ చేసింది అతను ఫోన్ లిఫ్ట్ చెయ్యకపోవడంతో ఇంటర్ అమ్మాయి డెత్ నోట్ లో పూర్తి వివరాలు రాసిపెట్టి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

ఇంటర్ చదువుతున్న అమ్మాయి
తమిళనాడులోని కోయంబత్తూరు సిటీలోని ఆర్ఎస్ పురంలోని స్వామి కాలనీలో 17 అమ్మాయి నివాసం ఉ:టున్నది. కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ కాలేజ్ లో ఈ అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయిర్ చదువుతోంది. కాలేజ్ లో చదువుతున్న అమ్మాయి ఉన్నత విద్య అభ్యసించి మంచి ఉద్యోగం చెయ్యాలని అనుకుంది. ఇంటర్ సెకండ్ ఇయిర్ చదువుతున్న అమ్మాయి ఇంటర్ పూర్తి చేసి సాఫ్ట్ వేర్ ఇంజనీరు కావాలని కలలుకనింది.

ఫిజిక్స్ లెక్చరర్ ఉద్యోగం
అమ్మాయి చదువుతున్న కాలేజ్ లో ఇంటర్ ఫస్ట్ ఇయిర్, సెకండ్ ఇయిర్ విద్యార్థలకు మిథున్ చక్రవర్తి అనే యువకుడు ఫిజిక్స్ పాఠాలు చెబుతున్నాడు. కొన్ని సంవత్సరాల నుంచి అదే కాలేజ్ లో మిథున్ చక్రవర్తి ఫిజిక్స్ లెక్టరర్ గా ఉద్యోగం చేస్తున్నాడని సమాచారం. కాలేజ్ కు వెలుతున్న అమ్మాయి మీద అదే కాలేజ్ లో ఫిజిక్స్ లెక్చరర్ గా ఉద్యోగం చేస్తున్న కామాంధుడు మిథున్ చక్రవర్తి కన్నుపడింది.

అమ్మాయి మీద ఎక్కువ శ్రద్దపెట్టిన కామాంధుడు
కాలేజ్ లో చదువుతున్న అమ్మాయిలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్న అధ్యాపకుడు మిథున్ చక్రవర్తి ఈ అమ్మాయి మీద ఎక్కువ ఆసక్తి చూపించి ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశాడని తెలిసింది. అధ్యాపకుడు మిథున్ చక్రవర్తి లైంగిక వేధింపులు ఎక్కువ కావడంతో ఆమె ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయం చెప్పలేకపోయిందని సమాచారం.

బలవంతంగా కాలేజ్ కు పిలిపించి ?
కరోనా వైరస్, లాక్ డౌన్ సమయంలో ఆన్ లైన్ క్లాసులు జరుగుతుంటే ఆ అమ్మాయికి ఫోన్ చేసిన అధ్యాపకుడు మిథున్ చక్రవర్తి స్పెషల్ క్లాస్ ఉందని, నువ్వు కచ్చితంగా కాలేజ్ లో జరిగే క్లాసుకు హాజరుకావాలని చెప్పాడు. ఇదే ఏడాది ఏప్రిల్ నెలలో ఒంటరిగా ఆ అమ్మాయిని మాత్రమే బలవంతంగా కాలేజ్ కు పిలిపించిన కామాంధుడు మిథున్ చక్రవర్తి ఆమె మీద లైంగిక దాడి చేశాడు. ఈ విషయం బయటకు చెబితే నిన్ను పరీక్షలు రాయనివ్వనని, కచ్చితంగా చంపేస్తానని ఆమెను మిథున్ చక్రవర్తి బెదిరించాడని తెలిసింది.

ఉద్యోగం ఊడినా చిత్రహింసలు పెట్టాడు
అప్పటి నుంచి మిథున్ చక్రవర్తి పదేపదే ఆ అమ్మాయి మీద లైంగిక దాడి చేసి చిత్రహింసలకు గురి చేశాడు. కాలేజ్ అమ్మాయి కాలేజ్ యాజమాన్యంకు ఫిర్యాదు చెయ్యడంతో కాలేజ్ యాజమాన్యం మిథున్ చక్రవర్తిని ఉద్యోగం నుంచి తొలగించారు. తన ఉద్యోగం పోవడానికి ఆ అమ్మాయి కారణం అని రగిలిపోయిన మిథున్ చక్రవర్తి ఆమె కాలేజ్ కు వెళ్లి వస్తున్న సమయంలో ఇంకా చిత్రహింసలకు గురి చేశాడని ఆరోపణలు ఉన్ననాయి.

ఉరి వేసుకున్న అమ్మాయి...... డెత్ నోట్ లో ?
మిథున్ చక్రవర్తి చిత్రహింసలు భరించలేని కాలేజ్ అమ్మాయి సాయంత్రం ఆమె ఫ్రెండ్ కు ఫోన్ చేసింది. కాలేజ్ అమ్మాయి ఫోన్ చేసిన సమయంలో ఆమె ఫ్రెండ్ ఫోన్ లిఫ్ట్ చెయ్యకపోవడంతో ఆమె ఇంకా ఆవేదన చెందింది. అదే రోజు కుటుంబ సభ్యులు బయటకు వెళ్లిన తరువాత ఇంటర్ అమ్మాయి రాత్రి 7 గంటల సమయంలో డెత్ నోట్ లో పూర్తి వివరాలు రాసిపెట్టి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

కామాంధుడి కథ చాలా ఉంది !
తన ఆత్మహత్యకు లెక్చరర్ మిథున్ చక్రవర్తి కారణం అని, అతన్ని వదిలిపెట్టకూడదని, అతన్ని కఠినంగా శిక్షించాలని రాసిపెట్టిన కాలేజ్ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని కోయంబత్తూరు సిటీ ఎస్పీ చెప్పారు. ఫోక్సో చట్టం కింద లెక్చరర్ మిథున్ చక్రవర్తిని అరెస్టు చేశామని, నిందితుడిని విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. చాలా మంది కాలేజ్ అమ్మాయిలతో మిథున్ చక్రవర్తి ఇలాగే అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు ఉన్నాయని, పూర్తి వివరాలు సేకరిస్తున్నామని కోయంబత్తూరు సిటీ పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications