College girl: బలవంతంగా గుడిలో పెళ్లి చేసుకున్న బాయ్ ఫ్రెండ్, బ్లాక్ మెయిల్, ఫ్రెండ్ తో కలిసి !
బెంగళూరు/విజయనగర/బళ్లారి: కాలేజ్ కు వెళ్లి వస్తున్న యువతి సంతోషంగా ఉంటూ బాగా చదువుకోవాలని ఆశపడింది. కాలేజ్ కు వెళ్లి వచ్చే సమయంలో ఓ యువకుడు ఆమెకు పరిచయం అయ్యాడు. ఇద్దరి పరిచయం ప్రేమగా మారింది. కాలేజ్ పూర్తి అయిన తరువాత కొంత సేపు ఆమె స్నేహితుడితో కాలం గడిపింది. కాలేజ్ కు వెళ్లిన యువతిని మాయమాటలు చెప్పి పిలుచుకుని వెళ్లిన స్నేహితుడు గుడిలో బలవంతంగా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. గుడిలో పెళ్లి చేసుకునే సమయంలో ఫోటోలు, వీడియోలు తీశాడు. ఈ విషయం మీ ఇంట్లో చెబితే పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు. పెళ్లి చేసుకున్న యువతిని స్నేహితుడితో కలిసి ఆమె మీద గ్యాంగ్ రేప్ చేశాడు. గుడిలో జరిగిన పెళ్లి ఫోటోలు అడ్డం పెట్టుకుని స్నేహితుడితో కలిసి ఆమె మీద పదేపదే అత్యాచారం చెయ్యడం కలకలం రేపింది.

కాలేజ్ అమ్మాయి
కర్ణాటకలోని విజయనగర జిల్లా (బళ్లారి సమీపంలో ఉన్న జిల్లా)లోని హరపనహళ్ళి సమీపంలోని హలువాగలు గ్రామంలో 17 ఏళ్ల అమ్మాయి నివాసం ఉంటున్నది. విజయనగరలోని ఓ ప్రైవేట్ కాలేజ్ లో ఈ అమ్మాయి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కాలేజ్ కు వెళ్లి వస్తున్న యువతి సంతోషంగా ఉంటూ బాగా చదువుకోవాలని ఆశపడింది.

కాలేజ్ అమ్మాయి ఫ్రెండ్
కాలేజ్ కు వెళ్లి వస్తున్న యువతికి హలువాగలు గ్రామంలో నివాసం ఉంటున్న నింగరాజు అనే యువకుడు పరిచయం అయ్యాడు. కాలేజ్ అమ్మాయి, నింగరాజు పరిచయం ప్రేమగా మారింది. కాలేజ్ పూర్తి అయిన తరువాత కొంత సేపు ఆ అమ్మాయి స్నేహితుడు నింగరాజుతో కాలం గడిపింది. చాలాకాలాం కాలేజ్ అమ్మాయితో నింగరాజు మాట్లాడుతున్నాడు.

గుడిలో బలవంతంగా పెళ్లి
గత ఏడాది డిసెంబర్ 4వ తేదీన ఆ అమ్మాయి కాలేజ్ కు వెళ్లింది. సాయంత్రం ఎప్పటిలాగే కాలేజ్ అమ్మాయి ఆమె స్నేహితుడు నింగరాజును కలిసింది. ఆ సమయంలో కాలేజ్ కు వెళ్లిన యువతిని మాయమాటలు చెప్పి ఆటోలో పిలుచుకుని వెళ్లిన నింగరాజు అతని స్నేహితుడు దేవరాజ్ సహాయంతో శ్రీ ఆంజనేయ స్వామి గుడిలో బలవంతంగా ఆమెను పెళ్లి చేసుకున్నాడు.

పెళ్లి ఫోటోలు అడ్డం పెట్టుకుని ?
గుడిలో పెళ్లి చేసుకునే సమయంలో నింగరాజు స్నేహితుడు దేవరాజ్ కొన్ని ఫోటోలు, వీడియోలు తీశాడు. ఈ విషయం మీ ఇంట్లో చెబితే పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని కాలేజ్ అమ్మాయిని ఆమె స్నేహితుడు నింగరాజు బ్లాక్ మెయిల్ చేశాడు. పెళ్లి చేసుకున్న యువతిని నింగరాజు, అతని స్నేహితుడు దేవరాజ్ తో కలిసి ఆమె మీద గ్యాంగ్ రేప్ చేశాడు.

విసిగిపోయి కేసు పెట్టిన కాలేజ్ అమ్మాయి
గత నెల రోజుల నుంచి నింగరాజు, అతని స్నేహితుడు దేవరాజ్ కలిసి పదేపదే కాలేజ్ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసి ఆమె మీద అత్యాచారం చెయ్యడం మొదలు పెట్టారు. నింగరాజు, దేవరాజ్ తీరుతో ఆమె విసిగిపోయింది. చివరికి వారి టార్చర్ తట్టుకోలేక కాలేజ్ అమ్మాయి పరపనహళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి కాలేజ్ అమ్మాయి మీద పదేపదే అత్యాచారం చేసిన నింగరాజు, దేవరాజ్ ను అరెస్టు చేశారు. గుడిలో బలవంతంగా జరిగిన పెళ్లి ఫోటోలు అడ్డం పెట్టుకుని బాయ్ ఫ్రెండ్ అతని స్నేహితుడితో కలిసి ఆమె మీద పదేపదే అత్యాచారం చెయ్యడం కలకలం రేపింది.












Click it and Unblock the Notifications