కులాలు, ఆస్తులు, అంతస్తులు వేరు, విడిపోలేకా, పెళ్లి చేసుకునే ధైర్యం లేక రైల్వే ట్రాక్ లో ముక్కలు!

చెన్నై: పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుని సుఖంగా జీవించలేమని, మనసు చంపుకుని వేరే వారితో కాపురం చెయ్యలేమని నిర్ణయించుకున్న ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. కులాలు వేరుకావడంతో వారి ప్రేమను చంపుకోలేక కలిసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమికులు ఆత్మహత్య చేసుకోవడంతో సినిమా లెవల్లో అంతకు ముందు పంచాయితీలు చేసిన పెద్దలు, వారి కుటుంబ సభ్యులు ఇప్పుడు విషాదంలో మునిగిపోయారు.

కాలేజ్ లో ప్రేమికులు

కాలేజ్ లో ప్రేమికులు

తమిళనాడులోని విరూద్ నగర్ సమీపంలోని విల్లిపుత్తిరి గ్రామానికి చెందిన బాలసుబ్రమణ్యన్ కార్మికుడు. బాలసుబ్రమణ్యన్ కుమారుడు శరవణన్ (22) విరూద్ నగర్ లోని ఓ ప్రైవేటు కాలేజ్ లో డిగ్రీ పూర్తి చేశాడు. విరూద్ నగర్ లోని రోసల్ పట్టికి చెందిన మురునగర్ కుమార్ రంజితా (22) ప్రైవేట్ కాలేజ్ లో బీఎస్పీ పూర్తి చేసింది. శరవణన్, రంజితా కాలేజ్ లో చదువుకునే రోజుల్లోనే ప్రేమలో పడ్డారు.

పెళ్లి చేసుకోవాలని ఆశ !

పెళ్లి చేసుకోవాలని ఆశ !

శరవణన్ పేద కుటుంబానికి చెందినవాడు. రంజితా కుటుంబ సభ్యులకు ఆస్తులు ఉన్నాయి. శరవణన్, రంజితా వివాహం చేసుకోవాలని నిర్ణయించారు. అయితే రంజితా, శరవణన్ కులాలు వేరు. తాము పెళ్లి చేసుకుంటామని శరవణన్, రంజితా వారి కుటుంబ పెద్దలకు చెప్పారు.

సినిమా లెవల్లో పంచాయితీలు

సినిమా లెవల్లో పంచాయితీలు

ఇద్దరి కులాలు, ఆస్తులు అంతస్తులు వేరు అయినప్పుడు మీరు ఎలా పెళ్లి చేసుకుంటారు ? మా పరువు ఏం కావాలని సినిమా లెవల్లో పెద్దలు పంచాయితీలు చేశారు. మీరు పెళ్లి చేసుకోవడానికి మేము అంగీకరించమని తేల్చి చెప్పారు. ఈ విషయంలో కొంత కాలం నుంచి శరవణన్, రంజితాలు కుమిలిపోయారు.

రైలు కిందపడి ముక్కలైనారు

రైలు కిందపడి ముక్కలైనారు

పెద్దలను ఎదిరించి ధైర్యంగా పెళ్లి చేసుకుని సుఖంగా జీవించలేమని, అలాగని ఇద్దరూ వేరే వ్యక్తులను వివాహం చేసుకోకూడదని శరవణన్, రంజితాలు నిర్ణయించారు. విరూద్ నగర్ లోని సాత్తూర్ రైల్వే ట్రాక్ సమీపంలో వేగంగా వస్తున్న రైలు కింద పడి శరవణన్, రంజితా ఆత్మహత్య చేసుకోవడంతో ఇద్దరి శరీరాలు ముక్కలు ముక్కలు అయ్యాయి. శరవణన్, రంజితా ఆత్మహత్య చేసుకోవడంతో ఇప్పుడు వారి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+