కాలేజ్ విద్యార్థిని కిడ్నాప్, కారులో ముగ్గురు కామాంధులు గ్యాంగ్ రేప్, యువతి ఫ్రెండ్!
ముంబై: కాలేజ్ కు బయలుదేరిన విద్యార్థినిని కారులో కిడ్నాప్ చేసిన నిందితులు వేగంగా వెలుతున్న వాహనంలోనే గ్యాంగ్ రేప్ చేసిన ఘటన ముంబై నగరంలో జరిగింది. బాధితురాలిని వైద్య పరీక్షలకు తరలించి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
పోలీసుల కథనం మేరకు గురువారం ఉదయం 7 గంటల సమయంలో 23 ఏళ్ల విద్యార్థిని కాలేజ్ కు బయలుదేరింది. మార్గం మధ్యలో సుబర్బన్ ప్రాంతంలోని చార్ కోప్ దగ్గర వెనుక నుంచి ఎకో కారులో వచ్చిన ముగ్గురు నిందితులు విద్యార్థినిని కారులో కిడ్నాప్ చేశారు.

ముంబైలోని మాద్ ఐస్ ల్యాండ్ ప్రాంతంలో వేగంగా వెలుతున్న కారులోనే విద్యార్థిని మీద గ్యాంగ్ రేప్ చేశారు. తరువాత విద్యార్థినిని సమీపంలో రోడ్డు పక్కన విసిరేసిన కామాంధులు అక్కడి నుంచి కారులో పరారైనారు. బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.
బాధితురాలికి వైద్య పరీక్షలు చేయించామని, వైద్య నివేదిక కోసం వేచి చూస్తున్నామని, విద్యార్థిని తెలిపిన వివరాల ఆధారంగా సబర్బన్, చార్ కోప్, మాద్ ఐస్ ల్యాండ్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. గ్యాంగ్ రేప్ చేసిన నిందితుల్లో విద్యార్థిని ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications